కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇంటిపై రాళ్ల దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే చెన్నైలోని ఆయన ఇంటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నా నగర్ లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇంటిపై కొద్దిసేపటి క్రితమే.. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు అవుతున్నాయి.
అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నివాసమైన అన్న నగర్ లో ఉంటున్న ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి పారిపోయారు. రెడ్ కలర్ కారులో వచ్చిన కొందరు దుండగులు..ఆయన ఇంటి పై రాళ్లను విసిరి ఆయనను గాయపరచడానికి ట్రై చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలుస్తుంది . దీంతో ఒకసారి అలర్ట్ అయిన తమిళనాడు పోలీసులు.. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇంటిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే రాళ్ల దాడి జరిగిన సమయంలో విశాల్ ఇంట్లో లేనట్టు సమాచారం. షూటింగ్ నిమిత్తం ఆయన బయటకు వెళ్లిన కొద్దిసేపటికే ఇలా జరిగినట్లు తెలుస్తుంది . అంతేకాదు విశాల్ ఇంటి పై దాడి జరగడానికి గల కారణాలు పోలీసులు పరిశీలిస్తున్నారు . అయితే అందుతున్న సమాచారం ప్రకారం రాజకీయాల విభేదాలు కారణంగానే విశాల్ పై దాడి జరిగినట్టు తెలుస్తుంది . అంతేకాదు ఆయనపై హత్య ప్రయత్నం కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో హీరోగా ఉన్నటువంటి హీరో విశాల్ రాజకీయాల్లోకి వచ్చాక తనకు శత్రువులు పెరిగినట్లు తెలుస్తుంది . ఈ సంఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.