మెగాస్టార్‌కి బ్యాడ్ టైం మొదలైనట్టేనా..? ఇక ఆయనకి ఇండస్ట్రీ హిట్ అనేది తన ఖాతాలో చేరడం కష్టమా అంటే కొందరు నెటిజన్స్ గానీ, యాంటీ ఫ్యాన్స్ గానీ ఇదే మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఒక్క ఆచార్య సినిమా ప్రభావం. అంతేకాదు, మలయాళ..తమిళ సినిమాలను రీమేక్ చేయడం కూడా మరో కారణం. చిరంజీవి గతంలో కూడా ఎన్నో రీమేక్ సినిమాలు చేసి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే, అది ఇప్పుడు వర్కౌట్ కావడం కాస్త కష్టమే అనేది చాలామంది అభిప్రాయం.
భారీ అంచనాల మధ్య వచ్చిన ఆచార్య ఫలితం గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. ఇక ఇప్పుడు అందరి చూపు గాడ్ ఫాదర్ మీద ఉంది. ఈ సినిమాను మలయాళంలో మోహన్ లాల్ నటించగా బ్లాక్ బస్టర్ సాధించిన లూసీఫర్ ఆధారంగా తెరకెక్కించారు. సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్, సత్యదేవ్, నయనతార లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనించబోతున్నారు. అయితే, ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ మొదలైనప్పటి నుంచే కాస్త డివైడ్ టాక్ వినిపించింది.
అదే టాక్ ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్‌కి వినిపిస్తోంది. ఇటీవల థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ వదిలారు. ఇది మెగా ఫ్యాన్స్‌లోనే కొందరికీ అంతగా నచ్చలేదనే ఫీడ్ బ్యాక్ వినిపించింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేయలేకపోయింది. భోళా శంకర్ సినిమా కథ కొత్తదేమీ కాదు. ఇలాంటి కథ మెగాస్టార్‌కి పెద్దగా కలిసి రావడం కష్టమని చెప్పుకుంటున్నారు. ఇక వాల్తేరు వీరయ్య కూడా అంత గొప్పగా రావడం లేదని టాక్ ? రషెస్ చూసిన చిరుయే అసంతృప్తి ఫీలయ్యారట.
ఇక ఆయన చేస్తున్న మరో మాస్ ఎంటర్‌టైనర్ కూడా గతంలో వచ్చిన సినిమాల తరహాలోనే సాగుతుందని పోస్టర్ దర్శకుడు చెప్పిన మాటలను బట్టే అర్థమవుతోంది. ఎంత మేకోవర్‌లో 25 ఏళ్ళ వయసు తగ్గించి చూపించినా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం అసలు కథ అర్థమవుతుంది. ఏజ్‌కి తగ్గట్టు మెగాస్టార్ కొత్త తరహా కథలను ఎంచుకుంటే తప్ప సక్సెస్‌లను అందుకోవడం కష్టం అంటున్నారు.
బాలయ్య చేసిన అఖండ సినిమా సక్సెస్ అందరికీ తెలిసిందే. ఆయన హిట్ ఫ్లాపులను పక్కనపెడితే, సినిమా సినిమాకు చాలా భిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి జాగ్రత్తలు చిరుకి అవసరం..అనేది ఫ్యాన్సే చెబుతున్నారు.