టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకి కొత్తగా పరిచయాలు అవసరమా..చెప్పండి. తన పేరుకి పరిచయం లేకుండా చేసుకున్న స్టార్ హీరో . తన పేరు చెప్పి నలుగురు హీరోలు ఇండస్ట్రీకి వచ్చేలా తన పేరుని తీర్చిదిద్దుకున్న వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి ..ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడంటే కచ్చితంగా దానికి కారణం ఆయన కృషి, పట్టుదల ,హార్డ్ వర్క్ అని చెప్పక తప్పదు. కాగా ప్రజెంట్ చిరంజీవి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.
దానికి కారణం ఆయన లుక్స్ అంటున్నారు మెగా అభిమానులు. దీంతో మెగా డాటర్ సుస్మితను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు . ఎందుకంటే ఆయన రీయంట్రీ తర్వాత నుంచి మెగాస్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తుంది చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత. ఖైదీ నెంబర్ 150 సినిమా నుంచి ఆయన లుక్స్ లో చాలా లుక్స్ లో చాలా చేంజ్ ఉందంటూ అభిమానులను ఆకట్టుకునే విధంగా లేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఖైదీ నెంబర్ 150 సినిమాకు సుస్మిత వర్క్ చేసింది కొంచెమే ఆయన నటించిన సైరా నరసింహారెడ్డికి పూర్తిస్థాయిలో కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసింది.
దీనిపై అప్పట్లో సుస్మిత ట్రోలింగ్ కు గురైంది. ఇక ఆ తర్వాత వచ్చిన ఆచార్య గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు. దారుణాతి దారుణంగా ఉన్నాయంటూ సుస్మితాను బూతులు తిట్టారు .కాగా ఇప్పుడు రీసెంట్ గా గాడ్ ఫాదర్ విషయంలోనూ చిరంజీవి స్టైల్ కి అలాంటి తప్పే చేస్తునారు సుస్మిత. దీంతో మెగాస్టార్ అభిమానులు ఆమెను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. “మీ నాన్నగారి మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్న సుస్మిత.. వెంటనే ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ అలాగే స్టైలింగ్ విషయంలో దూరంగా ఉండు. ఆయన జోలికి వెళ్లొద్దు ..అప్పుడే మెగాస్టార్ సినిమా హిట్ కొడతాడు..” అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు చేస్తున్నారు జనాలు. కొందరైతే “మీకు దండం పెడతాం సుస్మిత.. చిరంజీవికి దూరంగా ఉండు. ఆయన కెరియర్ ఇంకా చాలా ఉంది” అంటూ చెప్పుకొస్తున్నారు.