సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఈ ట్రోలింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ప్రముఖ రాజకీయ నాయకులు బడా హీరోస్ పై ఇలాంటి ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంది. ఒక స్టార్ సెలబ్రెటీ మాట్లాడిన తప్పే.. మాట్లాడకపోయినా తప్పే..ట్వీట్ చేసిన తప్పే..చేయకపోయినా తప్పే ..నిల్చున్న తప్పే కూర్చున్న తప్పే.. ఏం చేసినా కానీ సెకండ్స్ లో సోషల్ మీడియాలో మీమ్‌స్ వైరల్ అయిపోతూ ఉంటాయి. అయితే ఇలాంటి మీమ్‌స్ జనాలను నవ్వించే విధంగా ఉండాలి కానీ బాధపెట్టే విధంగా ఉండకూడదు అంటూ చెప్పుకొస్తున్నారు మా ప్రెసిడెంట్ టాలీవుడ్ స్టార్ హీరోస్ మంచు విష్ణు.
మనకు తెలిసిందే మంచు విష్ణు ఈ మధ్యనే మా ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అయ్యారు. అయితే రీసెంట్ గా ఆయన నటించిన “జిన్నా” సినిమా రిలీజ్ కు సిద్ధం అంటూ ప్రకటించి.. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల ఆయన జిన్నా సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది . ఈ క్రమంలోనే మీడియా ముందు మాట్లాడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై మంచు విష్ణు నోరు విప్పారు. ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరీ దారుణంగా బిహేవ్ చేస్తున్నాయని.. రోజు రోజుకి శృతిమించి హద్దులు దాటి మరి థంబ్ నైల్స్ పెట్టి స్టార్ జీవితాలతో ఆడుకుంటున్నాయని మండిపడ్డారు.
బతికున్న స్టార్స్ ని చనిపోయారు అంటూ యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేస్తుందని.. అంతేకాదు ఇలాంటి వీడియోస్ తమ బంధువులు అభిమానులు చూస్తే ఏమైపోతారు అని ప్రశ్నించాడు. అంతే కాదు హీరో హీరోయిన్స్ పై గాసిపులు రాసుకోండి అంతేకానీ ఇలా బ్రతికున్న మనుషుల్ని చచ్చిపోయారు అంటూ రాసి వాళ్ళ కుటుంబ సభ్యుల ను బాధ పెట్టకండి ..భయపెట్టకండి” అంటూ చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తూ వేధిస్తున్న 18 మంది యూట్యూబ్ ఛానల్ పై కేసు పెట్టడానికి రెడీగా ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు..” నన్ను ట్రోల్ చేసిన పర్లేదు కానీ నా కుటుంబాన్ని ట్రోల్ చేయడం దారుణం” అంటూ చెప్పుకొచ్చారు. కేవలం మంచు విష్ణునే.. కాదు చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా మనోవేదనకు గురి అవుతున్నారు. ఫేస్ ని మార్ఫింగ్ చేసి హీరోయిన్స్ వల్గర్ ఫొటోస్.. బతికున్న సెలబ్రిటీస్ చనిపోయారు అంటూ థంబ్ నైల్స్ పెట్టి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి వారిని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మంచి విష్ణు చెప్పుకొచ్చారు.