లైగర్ ఎంత పెద్ద డిజాస్టర్ అంటే ఫస్ట్ వీక్ కంప్లీట్ కాకుండానే ఈ సినిమా నెగటివ్ షేర్స్‌లోకి వెళ్లిపోయింది. ఓ భారీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కి భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా ఇంత దారుణ పరాభవం మూటకట్టుకుంటుందని ఎవ్వరూ ఊహించరు. లైగర్ ముందు విజయ్ దేవరకొండ వరల్డ్‌ఫేమస్ లవర్ సినిమాతో పెద్ద డిజాస్టర్ మూటకట్టుకోగా ఇప్పుడు లైగర్ ఆ సినిమాను మించిన డిజాస్టర్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా ప్లాప్ తర్వాత దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. ఈ సినిమాలో టీఆర్ఎస్ మంత్రి ఒకరు పెట్టుబడులు పెట్టారని… అది బ్లాక్‌మనీ అంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఒకరు సంచలన ఆరోపణలు చేయడం కూడా మీడియాలో హైలెట్ అవుతోంది. అసలు ఈ వార్తలను ఖండించలేనంత స్థితిలోకి వెళ్లిపోయాడు హీరో విజయ్. పైగా తాను ఈ సినిమా ప్లాప్ తర్వాత తన రెమ్యునరేషన్ నుంచి రు. 6 కోట్లు వెనక్కు ఇచ్చేశాడంటూ జరిగిన ప్రచారం కూడా అవాస్తవమే అని ఇప్పుడు అంటున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే పెద్ద హడావిడి చేశారు దర్శకుడు పూరి, ఛార్మి. ఇప్పుడు వాళ్లిద్దరు పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అసలు ఈ సినిమా నెగటివ్ ప్రచారంపై చిన్న ట్వీట్ కూడా వేసే స్థితిలో వీరిద్దరు లేరు. ఇక పూరి ముంబైలో ఉన్న ఆఫీస్ ఖాళీ చేసి హైదరాబాద్‌కు వచ్చేశాట. ఇక డిస్ట్రిబ్యూటర్ల తాలూకూ నష్టాలు ఎలా ? సెటిల్ చేయాలా ? అని తీవ్ర తర్జన భర్జనలు కూడా పడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఛార్మీ కూడా ఉన్నదంతా ఊడ్చి పెట్టేసి ఇప్పుడు మళ్లీ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు పరిస్థితిలోకి వెళ్లిపోయిందని అంటున్నారు. ఇక పూరి పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే లైగర్ తర్వాత వెంటనే విజయ్‌తో జనగణమన చేయాలనుకుంటే.. ఇప్పుడు విజయ్ నో చెప్పేశాడు. అసలు ఇప్పట్లో ఈ సినిమా లేదని తేలిపోయింది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ చేయాలని రామ్ ముందు అనుకున్నాడు. అయితే లైగర్ దెబ్బతో పాటు వారియర్ తో రామ్ కూడా పూరితో సినిమా చేసేందుకు సాహసించడం లేదు.
ఇప్పుడు కేవలం పూరికి ఉన్న ఆప్షన్ అతడి కొడుకు ఆకాష్ మాత్రమే. అందుకే ఆకాష్‌తోనే సినిమా చేసుకోవాలని అనుకుంటున్నాడట. ఇక ఈ సినిమా రిలీజ్ రోజు పెద్దమ్మగుడి దగ్గర కనిపించిన ఛార్మీ మళ్లీ ఆ తర్వాత ఎక్కడా కనిపిస్తే ఒట్టు. చివరకు ఆమె సోషల్ మీడియా నుంచే బ్రేక్ తీసుకుంటానని చెప్పింది. ఏదేమైనా ఒక్క లైగర్ దెబ్బతో ఇంత మంది జీవితాలు తల్లకిందులు అయిపోయాయి.