కృతి శెట్టి.. సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే సినీ ఇండస్ట్రీని ఊపేసిన బ్యూటీ. పేరుకు కన్నడ నటి అయినా తెలుగులో బాగా పాపులర్ అయింది . నిజానికి అమ్మడు కన్నడ కన్నా తెలుగులోనే ఫేమస్ అయిందని చెప్పాలి . కన్నడలో ఈ పేరు చెప్పిన పెద్దగా జనాలు పట్టించుకోరు. అదే తెలుగులో అయితే వామ్మో రచ్చ రంబోలా చేస్తారు. అలాంటి క్రేజియస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ యంగ్ బ్యూటీ కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృతిశెట్టి ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయింది.
రీసెంట్గా వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ..హ్యాట్రిక్ హిట్లతో టాప్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు కృతిశెట్టి హ్యాట్రిక్ ఫ్లాపులతో తన గ్రాఫ్ ను డౌన్ చేసుకుంది. ఈ క్రమంలోనే కృతి శెట్టి కొన్నాళ్లు సినిమాకు బ్రేక్ వేయాలనుకుంటుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాగా ఇలా ఉంటే నిన్న కృతశెట్టి పుట్టినరోజు. ఆమె తన 19వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కృతి శెట్టికి ఇప్పటికి టామ్ అండ్ జెర్రీ చూసే అలవాటు ఉందట ..అంతేకాదు ఈ పాపకు ఇడ్లీలో నెయ్యి కారంపొడి వేసుకొని తినడం అంటే మహా ఇష్టమట. నిజం చెప్పాలంటే కృతి శెట్టి థియేటర్స్ లో సినిమా చూడడం అస్సలు ఇష్టం ఉండదట. కానీ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక అది అలవాటు చేసుకుందట కృతి. అయితే ఆమె ఫ్రెండ్స్ తో బయటికి తిరగడానికి కూడా ఇష్టపడదట.. తనకు ఖాళీ టైం ఉంటే బుక్స్ చదవడానికి లేదా అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతుందట.
అంతేకాదు కృతి శెట్టి పేరుపై దాదాపు 50 కోట్ల ప్రాపర్టీ ఉన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతుంది. అమ్మడు ప్రజెంట్ ఒక్కో సినిమాకి రెండున్నర కోటి రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకుంటుంది. అంతేకాదు ఇప్పటివరకు ఆరు సినిమాలు చేసింది మూడు సినిమాలు కమిట్ అయింది మొత్తం తొమ్మిది సినిమాల రెమ్యూనిరేషన్ అమ్మడు తన ఖాతాలో వేసుకుంది. కాగా కృతి శెట్టి దగ్గర 50 లక్షల విలువైన ఆడి ఏ4 కారు, 35 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూన్ కారు, అలాగే ఆమెకు ఎంతో ఇష్టమైన 20 లక్షల విలువైన హుండాయ్ కార్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇవే కాదు కృత్తి శెట్టి కోసం వాళ్ళ అమ్మ మొత్తం బంగారం దాచిపెట్టిందని.. నాన్నగారు బెంగళూరు, హైదరాబాద్, ముంబై నగరాలలో ఇళ్ళు స్థలాలు తీసి పెట్టారని తెలుస్తుంది. ఇవన్నీ దాదాపుగా కౌంట్ చేసుకుంటే ఆస్తి 50-60 కోట్లు దాటుతున్నట్లు తెలుస్తుంది.