Moviesచిరంజీవి చేసిన ప‌నికి చాలా బ్యాడ్‌గా ఫీల‌య్యా... స్టార్ డైరెక్ట‌ర్ సంచ‌ల‌న...

చిరంజీవి చేసిన ప‌నికి చాలా బ్యాడ్‌గా ఫీల‌య్యా… స్టార్ డైరెక్ట‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లతో నటించాడు. చిరంజీవి ఎంత మంది స్టార్ డైరెక్టర్లతో ఎన్ని సినిమాలలో నటించినా చిరు కెరీర్‌ మలుపుతిప్పి ఆయనను మెగాస్టార్ ను చేసిన ఘనత మాత్రం కచ్చితంగా సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డికే దక్కుతుంది. కే రాఘవేంద్రరావు శిష్యుడుగా అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించిన కోదండరామిరెడ్డి `సంధ్య‌` సినిమాతో మెగాఫోన్ పట్టారు. తొలి సినిమా సూపర్ హిట్ అవడంతో ఆయనకు తిరుగులేని క్రేజ్ వచ్చేసింది.

కోదండరామిరెడ్డి తన కెరీర్ మొత్తం మీద 92 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన కెరీర్లో మెగాస్టార్ చిరంజీవితో ఏకంగా 23 సినిమాలను తెరకెక్కించారు. ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్లో 23 సినిమాలు రావడం… అందులో ఒకటి రెండు సినిమాలు మిన‌హా అన్ని సూపర్ డూపర్ హిట్లు అవ్వటం.. కేవలం ఆ డైరెక్టర్ సినిమాలతోనే ఆ హీరోకు ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిష‌న్‌ రావటం అంటే మామూలు విషయం కాదు. చిరంజీవికి `ఖైదీ` సినిమాతో మెగాస్టార్ బిరుదు వచ్చింది.

ఇంకా చెప్పాలంటే చిరంజీవిని టాలీవుడ్ లో మకుటం లేని మహారాజుగా మార్చింది కూడా `ఖైధీ` సినిమాయే. ఆ సినిమాకు కూడా కోదండరామిరెడ్డి దర్శకుడు. అలాంటి దర్శకుడుతో చిరంజీవికి ఆ తర్వాత గ్యాప్ వచ్చిందన్న ప్రచారం ఉంది. చాలా యేళ్ల పాటు వారి మ‌ధ్య మ‌న‌స్ఫూర్తిగా మాట‌లు కూడా లేవు. అయ‌తే ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై కోదండరామిరెడ్డి స్పందిస్తూ చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు.

 

చిరంజీవి తాను ఎక్కడ కలుసుకున్నా మాట్లాడుకుంటూ ఉంటామని.. అయితే ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిని మీ కెరీర్ ఎదుగుదలకు తోడ్పడిన దర్శకుల పేర్లు చెప్పమని అడిగితే.. అందులో తన పేరు చెప్పకపోవడం తాను చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యానని… ఎంతో ఆవేదనకు గురయ్యాను అన్న మాట నిజమే అని అంగీకరించారు. చిరంజీవితో తాను తీసిన 23 సినిమాలలో ఒకటి రెండు సినిమాలు మినహా అన్ని సూపర్ హిట్ అయ్యాయని… అలాంటి తన పేరు చిరంజీవి గుర్తుపెట్టుకో పోవటం తనను చాలా ఆవేదనకు గురి చేసిందని కూడా కోదండరామిరెడ్డి చెప్పారు.

చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారన్న వార్తల నేపథ్యంలో తాను ఐదు ఆరుసార్లు ఏమయ్యా ? రాజకీయాల్లోకి వస్తున్నావట కదా అని అడిగితే అదేం లేదని చెప్పారని. అయితే త‌న‌కు అలా చెప్పిన నెల రోజులకే ఆయన ప్రజారాజ్యం పార్టీని ఎనౌన్స్ చేశారని కోదండరామిరెడ్డి చెప్పారు. చిరంజీవితో తనకు ఎంత మాత్రం గ్యాప్ లేదని… ఒకవేళ చిరంజీవి ఎలా ? ఫీలవుతున్నారు నాకు తెలియదని కూడా కోదండరామిరెడ్డి చెప్పారు.

ఏదేమైనా కోదండరామిరెడ్డి వ్యాఖ్యలు చూస్తే చిరంజీవికి ఆయనకు ఎక్కడో అయితే ఉందని అర్థమవుతుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో చివరిగా `ముఠామేస్త్రి` సినిమా వచ్చింది. అయితే కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా పరిచయం అయినప్పుడు… చిరంజీవిని ప్ర‌మోష‌న్ కోసం చిన్న సహాయం అడిగినా పట్టించుకోలేదని.. అందుకే కోదండరామిరెడ్డి చిరుపై అసంతృప్తితో ఉన్నారన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news