అందాల తార అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా నిలబడేందుకు తంటాలు పడుతోంది. అంత గొప్ప నటి నట వారసురాలైనా కూడా హీరోయిన్గా మాత్రం కనీసం తనలో నాలుగవ వంతు కూడా క్రేజ్ ఇప్పటికీ దక్కలేదు. మొదటి సినిమా ధడక్ కాస్త పర్వాలేదనిపించింది. ఆ తర్వాత జాన్వీ కపూర్ నటించిన సినిమాలు కూడా కాస్త పర్వాలేదనే టాక్ దగ్గరే ఆగిపోతున్నాయి తప్ప భారీ హిట్‌గా మాత్రం నిలవడం లేదు.
తండ్రి బోనీకపూర్ పెద్ద నిర్మాత. అయినా శ్రీదేవీ కోరిక మేరకు తన బాధ్యతలను బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ మోస్తున్నాడు. జాన్వీ కొత్త కథ ఏదీ ఒకే చేయాలన్నా కూడా కరణ్ ఫింగరింగ్ ఉండాల్సిందే. బోనీకంటే కరణ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇది జాన్వీ కెరీర్‌కి ఆటంకంగా మారిందని చెప్పుకుంటున్నారు.
బోనీ కపూర్‌కి తన ఇద్దరు కూతుళ్ళని సౌత్ సినిమా ఇండస్ట్రీలకి మరీ ముఖ్యంగా తెలుగు లేదా తమిళ ఇండస్ట్రీలకి పరిచయం చేయాలని చూస్తున్నారు. కానీ, ఎందుకనో ఆయన పాచికలు పారడం లేదు. తమిళంలో వరుసగా హెచ్ వినోద్, అజిత్ ల కాంబినేషన్లో బోనీ కపూర్ సినిమాలను నిర్మిస్తూ సక్సెస్‌లు అందుకుంటున్నారు. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు.
అయినా తన కూతుళ్లను టాలీవుడ్‌కి తీసుకురాలేకపోతున్నారంటే అది కరణ్ వల్లే అని చెప్పుకుంటున్నారు. కాఫీ విత్ కరణ్ షోతో కరణ్ చాలా విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అయినా జాన్వీ కరణ్ ని గాడ్ ఫాదర్ గా భావించి తన కెరీర్‌ని ఆయన చేతుల్లో పెట్టింది. ఈ విషయంలో బోనీకపూర్ కూడా ఏమీ చేయలేకపోతున్నాడని చెప్పుకుంటున్నారు. మరి జాన్వీ కరణ్ కబంద హస్తాల నుంచి ఎప్పుటు బయటకు వస్తుందో ? చూడాలి.