టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు తెలుగు గడ్డపై ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే కనీసం వారం రోజుల ముందు నుంచే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రమే కాదు… సినీ అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లోనూ ఓ అటెన్షన్ అయితే ఉంటుంది. ఎన్టీఆర్ అభిమానులు అయితే రెండు, మూడు రోజుల ముందు నుంచే హడావిడి స్టార్ట్ చేసేస్తారు. ఎన్టీఆర్ ఎనర్జీ అన్నా, డ్యాన్సులు, డైలాగ్ డెలివరీ.. పాత్ర లో జీవించేందుకు అతడు పెట్టే ఎఫర్ట్ వీటిని మెచ్చని వారు ఉండరు.
ఎన్టీఆర్ అంటే టాలీవుడ్ వాళ్లే కాదు.. ఇతర భాషల్లో హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. కన్నడంలో దివంగత పునీత్ రాజ్‌కుమార్ – ఎన్టీఆర్ మంచి స్నేహితులు. పునీత్ పవరో సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా గెలయా సాంగే పాడాడు. అటు తమిళంలోనూ హీరోలు, హీరోయిన్లు ఎన్టీఆర్‌కు వీరాభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో యంగ్ హీరో చేరాడు.
బళ్లారి పేరు వినిపించగానే మనకు ముందుగా తెలుగోడు అయిన గాలి జనార్థన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. కర్నాకటలో బళ్లారి అంటే ఆ రాష్ట్ర రాజకీయాలకు ఫేమస్. అయితే బళ్లారి అంతా కర్నాటక జనాలతో కంటే తెలుగు వాళ్లతోనే ఎక్కువుగా నిండిపోయి ఉంది. బళ్లారిలో కన్నడ సినిమాల కంటే తెలుగు సినిమాలే బాగా ఆడతాయి. తెలుగు హీరోలకు, వాళ్ల సినిమాలకు అక్కడ పిచ్చ క్రేజ్ ఉంటుంది.
బళ్లారిలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా పిచ్చ క్రేజ్ ఉంటుంది. అక్కడ ఎన్టీఆర్ బాగా ఫాలోయింగ్ ఉంది. అక్కడ పొలిటికల్ కింగ్ అయిన గాలి జనార్థన్ రెడ్డికి కుమారుడు ఉన్నాడు. అతడి పేరే కిరిటీరెడ్డి. ప్రస్తుతం హీరోగా తన లక్ చెక్ చేసుకునేందుకు కిరీటి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే కిరీటి ఎన్టీఆర్ అంటే తాను వ్యక్తిగతంగా ఎంతో ఆరాధిస్తాను అని.. బళ్లారిలో భాషతో సంబంధం లేకుండా తాము అన్ని భాషల సినిమాలను ప్రోత్సహిస్తామని చెప్పాడు.
ఎన్టీఆర్ సార్ డ్యాన్సులు అన్నా… నటన అన్నా.. ఆయన సినిమాల్లో పాటలు అద్భుతంగా ఉంటాయని కిరీటిరెడ్డి చెప్పాడు. ఏదేమైనా కిరీటి ఎన్టీఆర్‌ను ఇంతలా ఆకాశానికి ఎత్తేయడంతో ఎన్టీఆర్ అభిమానులు కన్నడలోనూ, ఇటు తెలుగులోనూ కిరీటికి ఖచ్చితంగా హెల్ఫ్ అవుతారనే చెప్పాలి.