ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి దేవుడిపై మనసు మళ్లింది. సినీ మోజులో దేవుళ్లను మర్చిపోయిన మన హీరోయిన్స్ కి మళ్లీ దేవుళ్లు గుర్తు వచ్చిన్నట్లు ఉన్నారు. అందుకే ఈమధ్య చాలామంది స్టార్ హీరోయిన్స్ గుడి గోపురాలు అంటూ పూజలు చేస్తున్నారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. మనకు తెలిసిందే ఉప్పెన సినిమాతో తన తలరాతను తానే మార్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉంది.
కెరియర్ మొదట్లో వరుస హట్రిక్ హిట్లు అందుకున్న ఈ బ్యూటీ ప్రజెంట్ బిగ్గెస్ట్ ఫ్లాప్ రికార్డ్ ను అందుకోవడానికి రెడీ గా ఉంది. ఆమె ఈ మధ్య నటించిన రామ్ ది వారియర్.. నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఫ్లాప్ అవడం ఆమె కెరియర్ కు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ గా మారాయి. దీంతో కృతి నెక్స్ట్ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు ఆమె అభిమానులు. ఒకవేళ ఈ సినిమా కూడా సక్సెస్ కాకపోతే వరుస హ్యాట్రిక్ హిట్లు అందుకున్న కృతిశెట్టి..ఇప్పుడు వరుస ఫ్లాప్ సినిమాలో అందుకుంటుంది అంటూ ఇప్పటికే ట్రోలర్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కృతిశెట్టి..భయపడి తన నెక్స్ట్ సినిమా హిట్ అవ్వాలంటూ గుడిలో పూజలు చేస్తుందట. ఈ క్రమంలోనే ఆమె అమ్మతో కలిసి గుడికి వెళ్లి పూజలు చేస్తున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు తన సినిమా హిట్ అయితే దేవుడికి వెండి కిరీటం చేయిస్తానని భారీ మొక్కు మొక్కిందంట ఈ కృతి శెట్టి. మరి చూడాలి అందాల భామ కృతి శెట్టి కోరికను ఆ దేవుడు విన్నాడో లేదో ..నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యాక తెలిసిపోతుంది. ఏది ఏమైనా కృతశెట్టి కి కెరియర్ పై భయం పట్టుకుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.