కామ్న జఠ్మలాని ..ఈ పేరు విని చాలా కాలమే అయింది . రీసెంట్ టైంలో ఈ పేరు పెద్దగా పట్టించుకునే జనాలే లేరు. ఒకప్పుడు తన అందంతో తన నటనతో తన స్టైల్ తో కామెడీ రోల్స్ ను వల్గర్ రోల్స్ ను ఈక్వల్ గా పోషించిన ఈ అమ్మడు.. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా బ్రతుకుతుంది. 2005లో తెలుగులో వచ్చిన “ప్రేమికులు” అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన కామ్న జఠ్మలాని ఆ తర్వాత రెండు సినిమాలు చేసిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
గోపీచంద్ హీరోగా నటించిన “రణం” సినిమా ద్వారా కామ్న జఠ్మలాని గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా నుండి కామ్న జఠ్మలాని పేరును అందరు గుర్తుంచుకునేలా చేసుకున్నారు. ఇక తర్వాత పలు సినిమాలో నటిస్తూ కామెడీ రోల్స్ లో తనదైన స్టైల్ లో కామెడీని పండిస్తూ చేతికొచ్చిన అవకాశాలలో నచ్చిన రోల్స్ ని చేసుకుంటూ వచ్చింది. కాగా ముంబైలో జన్మించిన కామ్న జఠ్మలాని తల్లి ఫ్యాషన్ డిజైనర్ కావడంతో మోడలింగ్ వైపు అడుగులు వేసి ఆ తర్వాత మెల్లగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
అయితే సినీ ఇండస్ట్రీలో సినిమాలు చేసే టైంలోనే కామెడీ హీరో గా ఫేమస్ అయిన ఆయన తమ్ముడితో ప్రేమలో పడింది అంటూ వార్తలు వచ్చాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. ఆయన తమ్ముడు కూడా సినీ ఇండస్ట్రీలో చిన్నాచితక పాత్రలు చేసుకుంటూ తనదైన స్టైల్ లో గుర్తింపు పొందాడు . కొంతకాలం బాగానే సాగిన వీర ప్రేమ వ్యవహారం.. ఆ తర్వాత బెడిసి కొట్టింది. మారుతున్న కాలానికి పెరిగిపోతున్న ట్రెండ్ కి ఆ కామెడీ హీరోకి కొత్త అందాలు కావాల్సి వచ్చింది. దీంతో మోసపోయాను అంటూ కామ్న జఠ్మలాని సినీ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.