స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ చేసి సూపర్ హిట్లు కొట్టడం, భారీ వసూళ్లు సాధించడం అనే ట్రెండ్ పోకిరి సినిమాతో స్టార్ట్ అయ్యింది. ఈ ట్రెండ్ మిగిలిన సినిమాల కన్నా పోకిరి సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఈ ట్రెండ్ పోకిరితో మరింత హీటెక్కే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ యూట్యూబుల్లోనూ, ఛానెల్స్ లోనూ వందల సార్లు చూసిన సినిమాలు ఇప్పుడు సెలబ్రేషన్ల పేరిట థియేటర్లలో చూస్తుండడంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మరింత ఆదాయం వస్తోంది.
ఇక పోకిరి సినిమా రీ రిలీజ్‌కు వచ్చిన వసూళ్లతో అందరికి దిమ్మతిరిగి పోయింది. పోకిరి సినిమా రీ రిలీజ్‌లో ఏకంగా రు 1.5 కోట్ల వసూళ్లు సాధించి ట్రెండ్ సెట్ చేసింది. అయితే ఇప్పుడు జల్సా రీ రిలీజ్‌లో పోకిరి సినిమా వసూళ్లు దాటేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. జల్సా ఏకంగా రు 2.85 కోట్లు అందుకుని పోకిరి సినిమా రికార్డులు క్రాస్ చేసింది.
అసలు ఇవి మామూలు వసూళ్లు కావనే చెప్పాలి. రీ రిలీజింగ్ కేటగిరిలో ఆల్ టైం ఇండియన్ సినిమా హిస్టరీగా జల్సా నిలిచిందని చెప్పాలి. ఏదేమైనా పవన్ పవర్ ఏంటో ఈ సినిమాతో మరోసారి ఫ్రూవ్ అయ్యింది. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీ, తెలంగాణతో పాటు అటు ఓవర్సీస్‌లోనూ పలు ప్రాంతాల్లో జల్సా ప్రీమియర్ షోలు వేశారు. అమెరికా నుంచి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీనిని బట్టే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ వచ్చిన డబ్బుల నుంచి కొంత సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారు. ఇక ఇప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ సినిమాలు కూడా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తాయో ? చూడాలి.