సాయి పల్లవి ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మలర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తెలుగులో ఫిదా సినిమాతో అందరిని ఫిదా చేసేసింది. భానుమతి అంటూ అందరినీ భయపెట్టేసింది. సాయి పల్లవి గురించి చెప్పుకోవాలంటే మన ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది డ్యాన్స్. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సాయి పల్లవి డ్యాన్స్ ని మెచ్చుకున్నారంటే ఆమెలోనే టాలెంట్ ఆమెలోనే డాన్స్ ఎంత బాగుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
సాయి పల్లవిని సినిమాల పరంగా కన్నా కూడా వ్యక్తిగతంగా ఇష్టపడే జనాలు చాలామంది ఉన్నారు. ఆమె సిన్ సియారిటి.. ఆమె డెడికేషన్ ..ఆమె టైమింగ్ ..ఆమె పంచువాలిటీ.. ఆమె తీసుకునే నిర్ణయాలు తాను తీసుకున్న నిర్ణయాలపై నిలిచే స్టాండ్ . జనాలకు విపరీతంగా నచ్చుతుంది. ఏదైనా తను కథ నమ్మి సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని వెనక్కి తిరిగిచ్చేస్తుంది సాయి పల్లవి. నేటి కాలంలో ఇలాంటి హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది సాయి పల్లవి మాత్రమే అని చెప్పాలి.
అంతేకాదు నో ఎక్స్పోజింగ్ అంటూ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా లేడీ ఓరియంటెడ్ కథలతో హిట్లు కొట్టగలరు అంటూ ప్రూవ్ చేసింది. కాగా ఈ మధ్యకాలంలో సాయిపల్లవికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఓ టాప్ పొలిటీషియన్ కొడుకు సాయి పల్లవికి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారని. .. కాని దాని సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించింది అంటూ సోషల్ మీడియాలో ఓ రెంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. కాగా దీనిపై సాయి పల్లవి స్పందించినట్లు తెలుస్తుంది. ” ఆ వార్త నిజమైతే బాగుండు ఆ పొలిటిషియన్ కొడుకు ఎవరు నాకు చెప్పరా..” అంటూ ఫన్నీగా ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకొచ్చిందట. దీంతో సాయి పల్లవి మైండ్ ఏమైనా దొబ్బిందా అంటూ కొందరు ఆమెపై కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు సాయి పల్లవి ఇలా మాట్లాడడంపై కూడా అభిమానులు ఫైర్ అవుతున్నారు. మీపై ఇలాంటి తప్పుడు వార్తలు వస్తే మీరు ఖండించాలి కానీ లైట్ గా తీసుకుంటే ఎలా రేపు ఇంకొక న్యూస్ కూడా రావచ్చు సో బి కేర్ఫుల్ సాయి పల్లవి అంటూ ఆమెను వార్న్ చేస్తున్నారు.