డాక్టర్ కావాల్సింది యాక్టర్ అయ్యాను అంటూ చాలా మంది చాలా సందర్భాలలో చెప్పిన సంగతి తెలిసిందే. పోలీస్ కావాల్సిన వాడు యాక్టర్ అయ్యాడు. సుప్రీం హీరోగా మారాడు..మెగాస్టార్‌గా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, కెరీర్ ప్రారంభంలో చాలా అవస్థలు పడ్డ చిరంజీవి..ఆ తర్వాత స్వయంగా మన సినిమాలో హీరోయిన్‌గా ఈ అమ్మాయి అయితే బావుంటుందని నా అభిప్రాయం అని చెప్పే రేంజ్‌కి చేరుకున్నారు.
అలా మెగాస్టార్ రికమెండ్ చేసిన హీరోయిన్స్‌లో మాధవి ఒకరు. ఆమె కలర్ కాస్త తక్కువే. అయినా మాధవి ఎక్కువ సినిమాలు చేసింది. వాటిలో కూడా చిరంజీవి రికమెండ్ చేసినవే ఉండటం ఆసక్తికరమైన విషయం. చిరంజీవి – మాధవీ కాంబినేషన్ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఖైదీ సినిమాలోని రగులుతుంది మొగలిపొద పాటనే. వీరిద్దరు కలిసి నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 500 రోజులకి పైగా ప్రదర్శింపబడింది.
అప్పట్లో ఇదొక రికార్డ్ అని చెప్పాలి. అంతేకాదు చిరంజీవి కెరీర్‌లో 500 రోజులకి పైగా ఆడిన సినిమా కూడా ఇదే. దర్శకుడిగా కోడి రామకృష్ణకి మొదటి సినిమా కావడం విశేషం. అందరి కెరీర్‌లో మైల్ స్టోన్‌గా మిగిలింది. ఇందులో పాత్రలన్నీ చాలా సాధారణంగా కనిపిస్తాయి. అయితే, మాధవీ పర్ఫార్మెన్స్ మెగాస్టార్‌ను బాగా ఆకట్టుకుంది. ఆమె కళ్ళు చాలా పెద్దవి. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ అయినా ఇట్టే పలికించేస్తుంది.
ఇక అప్పట్లో బికినీ వేసి హాట్ టాపిక్ అయిన హీరోయిన్స్‌లో అందరూ మాట్లాడుకుంది మాధవీ గురించే. అంత క్రేజ్ ఉండేది. మాధవి హీరోయిన్‌గా నటిస్తే సినిమా బ్లాక్ బస్టర్ అనే పేరు వచ్చింది. అందుకే, చిరంజీవి ఒకదశలో ఆయన హీరోగా నటించే సినిమాలకి ఆమెను ఎక్కువగా రిఫర్ చేసేవారట. విజయశాంతి, రాధ, రాధిక సుహాసిని లాంటి వారున్నా కూడా మెగాస్టార్ ఎక్కువగా కొన్ని సినిమాలకి మాధవిని తీసుకుందామని పట్టుపట్టేవారట. అలా ఎక్కువ సినిమాలు మాధవి చిరుతో చేసింది.