Moviesనాగ్ మామ దెబ్బకు సమంత కెరీర్ తలకిందులు.. ఆ బంధం తెగిపోనుందా..!?

నాగ్ మామ దెబ్బకు సమంత కెరీర్ తలకిందులు.. ఆ బంధం తెగిపోనుందా..!?

పాపం.. సమంత ఒకప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ రేంజ్ తో ఇండస్ట్రీని అల్లాడించింది . ఇప్పుడు కూడా స్టార్ హీరోయినే ..కానీ సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిందనే చెప్పాలి. ఒకప్పుడు అంటే అక్కినేని ఫ్యాన్స్ సమంత ఫ్యాన్స్ ఇద్దరు ఆమె భజన ఎక్కువ చేసే వాళ్ళు.. కానీ ఇప్పుడు అలా కాదు అక్కినేని ఫ్యాన్స్ ఆమె పేరు చెబితేనే మండిపోతున్నారు . దానికి కారణాలు మనకు తెలిసిందే . ఆమె నాగచైతన్యకు విడాకులు ఇవ్వడం ఆయనపై మరిన్ని నిందలు వేయడంతో.. సమంత పై అక్కినేని అభిమానులు కోప్పడేలా చేస్తుంది.

కాగా విడాకుల తర్వాత అందరూ సమంత కెరియర్ డౌన్ అయిపోతుంది అనుకున్నారు. సినీ ఇండస్ట్రీలో సమంత ఇక ఎదగలేదు అంటూ కామెంట్స్ చేశారు. కానీ సీన్ మొత్తం టోటల్ రివర్స్ చేస్తూ సమంత తనదైన స్టైల్ లో ఊ ఉంటావా అంటూ ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం సమంత వైపే ఉంది. సమంత హీరోయిన్ గా ఎదగడానికి ఆమె నటన ఎంత కారణమో.. ఆమెకు డబ్బింగ్ చెప్పే చిన్మయి కూడా అంతే కారణం . . తెర పై సమంత అందాలు.. ఆమె గొంతు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఏం మాయ చేసావే సినిమా సక్సెస్ అవ్వడానికి చిన్మయి గొంతు సగం కారణం అని చెప్పక తప్పదు.

చిన్మయి సమంతకు చాలా సినిమాలుకు డబ్బింగ్ చెప్పింది. జనాల్లో చిన్మయి వాయిస్ అంటే సమంతనే గుర్తు వస్తుంది. కాగా ఇకపై ఆమె సమంతకు డబ్బింగ్ చెప్పలేను ఏమో అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . దానికి కారణం రీసెంట్ గా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ నే అని తెలుస్తుంది. రీసెంట్ ఇంటర్వ్యూలో చిన్మయి మాట్లాడుతూ..” నాకు తెలుగులో కెరియర్ ఇచ్చింది ఎవరు అంటే సమంతనే అని చెప్పాలి. నా వాయిస్ కి సగం హిట్ స్థానాన్ని కల్పించి నన్ను పాపులర్ చేసేసింది. అయితే ఇకపై నేను ఆమెకు డబ్బింగ్ చెప్పలేను అనుకుంటాను ..ఎందుకంటే సమంత తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. చక్కగా వివరిస్తుంది. దీంతో ఇప్పుడు ఆమె పాత్రలకు ఆమె డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇకపై నేను చెప్పలేను అనుకుంటాను సమంతకు డబ్బింగ్ చెప్పే దశ ముగింపుకు వచ్చేసిందని అనుకుంటున్నాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.


అయితే దీని వెనక నాగార్జున హస్తం ఉందంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. చిన్మయి భర్త రాహుల్ నాగార్జున మన్మధుడు 2 డైరెక్ట్ చేశాడు. కాగా ఆయనకు డైరెక్టర్ గా అవకాశాలు రావాలి అంటే నాగార్జున లాంటి పెద్ద హీరోలా అండ ఉండాల్సిందే. మరి ఆ ఇంటి కోడలు పొజిషన్ ని వద్దు అని బయటికి వచ్చిన హీరోయిన్ తో తన భార్య స్నేహం చేయడం ఇష్టం లేకే ఇలా చెప్పించారుఅంటున్నారు కొందరు జనాలు. మరి చూడాలి సమంత కెరియర్ ఎలా ఉంటుందో చిన్మయి వాయిస్ లేకుండా సినిమాలకి…?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news