గత మూడు నాలుగు సంవత్సరాలుగా టాలీవుడ్ లో ఒక పుకారు గట్టిగా వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీకి, అల్లూ ఫ్యామిలీకి సఖ్యత లేదని.. వీరిద్దరూ పైకి కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం వీరిమధ్య ఆధిపత్య పోరు, పంతం నివురుగప్పిన నిప్పులా ఉందనే గుసగుసలు వస్తున్నాయి. మెగా వారసుడు రామ్ చరణ్, అల్లు అర్జున్ ను ప్రమోట్ చేసే విషయంలో మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య పొరాపొచ్చలు వచ్చాయని నాలుగేళ్ల నుంచి ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రచారం అయితే వినిపిస్తోంది.
చిరంజీవి `ఖైదీ నెంబర్ 150`, `సైరా` సినిమాల ముందు వరకు రామ్ చరణ్ సినిమా కథలు ఎంపిక చేసే బాధ్యతను కూడా అల్లు అరవింద్ కే అప్పగించారు. ఆ టైంలో రామ్ చరణ్ కు వరుస ప్లాపులు పడడంతో… ( ముందు తాను విన్న మంచి కథలు బన్నీకి బ్లాక్ చేసేవాడని టాక్ ) కథలు వినే బాధ్యతను అరవింద్ నుంచి తప్పించి చరణ్ సినిమా కథలను కూడా స్వయంగా చిరంజీవి విని ఓకే చేస్తున్నారు. ఆ తర్వాత టాప్ ర్యాంక్ కోసం జరుగుతున్న పోటీలో రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ మధ్య పెద్ద యుద్ధం నడుస్తోంది. ఇటు అల్లు అర్జున్ కూడా మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి అల్లు ఫ్యాన్స్ పేరుతో సపరేట్గా ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు.
గత రెండేళ్లుగా చూస్తుంటే బన్నీ నందమూరి హీరోలకు బాగా దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్, బన్నీ బావా బావ అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. ఒకరి సినిమా రిలీజ్ అయినప్పుడు మరొకరు అభినందనలు చెప్పుకుంటున్నారు. అదే నందమూరి కాంపౌండ్ సీనియర్ హీరో బాలయ్యను అల్లూ ఫ్యామిలీ ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ కు తీసుకువచ్చి ఏకంగా `అన్‌స్టాపబుల్` టాక్ షో చేయించారు. ఈ టాక్ షో సూపర్ హిట్ అవడంతో బాలయ్య… అల్లు బంధం మరింత బలంగా అల్లుకుంది.
ఇలా అనేక పరిణామాలు అల్లు – మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరుగుతుందన్న సందేహాలు అయితే పెంచేసాయి. అయితే తాజాగా చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం అల్లు అరవింద్ అల్లు స్టూడియోస్ పేరిట స్టూడియో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండిపేట దగ్గరలో ఈ స్టూడియో నిర్మాణం ప్రారంభించారు. రీసెంట్‌గా ఈ స్టూడియో నిర్మాణం పూర్తికాగా… త్వరలోనే దీని ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు.
అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన ఈ స్టూడియోని అల్లు కుటుంబ సభ్యులు ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ స్టూడియోను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారట. చిరంజీవి స్వయంగా ఈ స్టూడియోను ప్రారంభిస్తే మెగా ఫ్యామిలీల మధ్య దూరం పెరిగింది అన్న పుకార్లకు కొంతవరకు అయినా చెక్ పెట్టినట్టు అవుతుందన్నదే అరవింద్ ప్లాన్‌గా తెలుస్తోంది.