సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక ప్రతి ఒక్కరు కామన్ గా చేసే పనులు మేకప్ . అది హీరో కాదు ,హీరోయిన్ కాదు ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు ,విలన్ కాదు.. ఎవరైనా సరే తెరపై కనిపించాలంటే కచ్చితంగా మేకప్ వేసుకుంటారు . అది సినీ ఇండస్ట్రీలో ఉండే కామన్ ఫ్యాక్టర్. అయితే కొందరికి హీరోలు మేకప్ వేసుకోవడానికి ఇష్టపడరు . నాచురల్ అందంతోనే కనిపించాలనుకుంటారు. కానీ స్టోరీలో భాగంగా ఇష్టం లేని పనులు చేయక తప్పదు . అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఓ సినిమా కోసం ఏకంగా మేకప్ వేసుకోకుండానే తెరపై కనిపించారు. అంతే కాదు తన అందంతో మెప్పించారు . ఆ సినిమా ఏంటి అనే డీటెయిల్స్ ఇక్కడ ఇప్పుడు తెలుసుకుందాం..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ..రాను రాను తండ్రిని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో సినీ ఇండస్ట్రీలో చెరగని స్థాయిని దక్కించుకున్నాడు. ప్రజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమా అయిపోగానే దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమాను చేయబోతున్నాడు. మహేష్ బాబు మేకప్ లేకుండా ఓ సినిమాలో నటించారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆ సినిమా మరేదో కాదు మహేష్ బాబు కెరియర్ లోని వన్ ఆఫ్ ది డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయిన ” నిజం “. తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇంచ్ మేకప్ కూడా వేసుకోలేదట .నేచురల్ బుక్స్ తో ఫేస్ వాష్ చేసుకుని స్క్రీన్ పై కనిపించాడట.
ఈ సినిమా కథపరంగా జనాలకు నచ్చినా స్క్రీన్ ప్లే పరంగా ఫ్లాప్ అయింది. అంతేకాదు మహేష్ బాబుని అలా అమ్మ చాటు బిడ్డగా చూడడానికి అంగీకరించలేదు సూపర్ స్టార్ ఫ్యాన్స్ .దీంతో సినిమాను అట్టర్ ప్లాప్ చేసి పక్కన పడేసారు. అయినా కానీ ఈ సినిమాలో మహేష్ బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటివరకు తన కెరియర్లు చేసిన సినిమాలలో ప్రతి సినిమాలోని మహేష్ బాబు మేకప్ తో కనిపించారట . ఈ ఒక్క సినిమా కోసమే మహేష్ బాబు న్యాచురల్ లుక్స్ లో కనిపించి మెప్పించాడు.. మరి చూడాలి భవిష్యత్తులో ఇలాంటి సన్నివేశాలు మరి ఏవైనా సినిమాకు రాబోతున్నాయో లేదో అనేది..?