Moviesఇంట్రెస్టింగ్: చిన్నగా ఉన్న వాటిని పెద్దగా చేసిన హీరోయిన్స్ వీళ్ళే..!!

ఇంట్రెస్టింగ్: చిన్నగా ఉన్న వాటిని పెద్దగా చేసిన హీరోయిన్స్ వీళ్ళే..!!

మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో ప్రజెంట్ హీరో హీరోయిన్స్ ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది హీరోయిన్స్ గురించి ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే హీరోలు నాన్న తాత పేర్లు చెప్పుకొని వచ్చిన వాళ్లే. వాళ్లకు ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తులు ముందుగానే ఉన్నాయి . కానీ హీరోయిన్స్ కి మాత్రం అలా ఏమీ బ్యాగ్రౌండ్ ఆస్తులు లేవు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చాకే వాళ్లు తమ బ్యాంక్ బ్యాలెన్స్ ని ఆస్తులని ప్రాపర్టీస్ ని పెంచుకున్నారు. అలా సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే కోట్ల ఆస్తి సంపాదించుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


తమన్నా : స్టార్ హీరోయిన్ తమన్నా కి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తక్కువే. చెప్పుకునే ఆస్తి కూడా లేదు . కానీ సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే తమన్న దగ్గర కోట్ల ఆస్తి ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. నిన్న మొన్న కూడా తమన్నా దగ్గర వజ్రాల మూట ఉంది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబైలో రెండు ఇల్లు.. హైదరాబాద్లో ఫ్లాట్స్ ..అది కాకుండా పలు రకాల బిజినెస్ లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది.

నయనతార : అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చేతిలో పది రూపాయలు లేకుండా అల్లాడిన రోజులు గడిపానని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. అలాంటిది ఇప్పుడు నయనతార ఎన్ని కోట్లకు అధిపతిరాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కొక్క మెట్టు సినీ ఇండస్ట్రీలో ఎక్కుకుంటూ తనదైన స్టైల్ లో మూవీస్ చేస్తూ.. ప్రజెంట్ సౌత్ ఇండియాలోనే టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది. అంతేనా రీసెంట్ గా తన పేరుపై ఉన్న ఆస్తులు అన్ని తన భర్త పై మార్చేసి భార్య.. ఓ భర్తకు ఎంత విలువ ఇస్తుందో ప్రూవ్ చేసింది. అందులో నిజంగా నయనతారకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

సమంత: స్టార్ హీరోయిన్ సమంత మొదట్లో ఎలాంటి లైఫ్ గడిపిందో మనకు తెలిసిందే. మిడిల్ క్లాస్ కాదు లోయర్ మిడిల్ క్లాస్ నుంచి ఇప్పుడు హై రేంజ్ కి ఎదిగింది అంటే ఏకైక కారణం ఆమె హార్డ్ వర్క్ .ప్రతి సినిమాలో ఆమె నటించిన తీరు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఏం మాయ చేసావే సినిమాలో ఆమె నటన చూసిన జనాలు ఇంప్రెస్స్ అయిపోయారు. రీసెంట్గా వచ్చిన తమిళ్ మూవీ లో ఆమె నటన చూసి ఫిదా అయిపోయారు. సమంత ఇండస్ట్రీలోకి వచ్చే ముందు వరకు ఆమె చేతిలో లక్ష రూపాయలు కూడా లేదు. కానీ ప్రజెంట్ ఇప్పుడు అదే సమంత పేరిట కోట్ల ఆస్తుల ప్రాపర్టీస్ ఉన్నాయి . ఇది ఒకటి చాలదు సమంత ఇండస్ట్రీకి వచ్చి ఎంత ఆస్తులు సంపాదించిందో చెప్పుకోవడానికి

రష్మిక : వామ్మో ఈ బ్యూటీ గురించి చెప్పడం దండగా అందరికీ తెలిసిందే. ఛలో సినిమాతో సైలెంట్ గా ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత మెల్ల మెల్లగా నేషనల్ క్రష్ గా మారి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తూ ..బాలీవుడ్ ను తన అందచందాలతో ఊపు ఊపేస్తుంది. అంత పెద్ద స్టార్ హీరోయిన్ . ఇప్పుడు రష్మిక పుష్ప సినిమాతో రష్మిక రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీకి రాకముందు రష్మిక ఓ మాస్తరు ఆస్తులున్నా.. ప్రజెంట్ రష్మిక తన సొంత కాళ్లపై సంపాదించుకున్న ఆస్తులు బోలెడు ఉన్నాయి . ముంబైలో కొత్త ఇల్లు కొనుక్కుంది . హైదరాబాద్లో ఫ్లాట్లు కొన్నింది. అది కాకుండా బిజినెస్ పెట్టడానికి ట్రై చేస్తుంది. ఈ ఒక్కటి చాలు రష్మిక సినీ ఇండస్ట్రీకి వచ్చాక ఎన్ని కోట్లు సంపాదించుకుందో చెప్పడానికి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news