ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం అవుతోంది. ఈ సీజన్ లో మొత్తం 20 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినవారిలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో పాపులర్ అయినవాళ్లే కనిపిస్తున్నారు. అలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీనే ఇనయా సుల్తానా. నిజానికి ఇనయ సుల్తానా ముందుగా కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసింది.. కానీ ఎలాంటి గుర్తింపు రాలేదు. కానీ ఆర్జీవీతో కలిసి ఉన్న ఓ వీడియో వైరల్ అవ్వడంతో ఒక్కరోజులో పాపులారిటీని సంపాదించుకుంది.
ఇనయా సుల్తానా భర్త్ డే పార్టీలో ఆర్జీవీ రచ్చ రచ్చ చేశాడు. ఇనయ సుల్తానను పట్టుకుని నలిపేశాడు. ముద్దులు పెట్టుకుని హగ్గులు ఇచ్చాడు. ఇక దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అయ్యింది. వీడియో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు అసలు ఇనయ సుల్తానా ఎవరా ? అని ఆరా తీసేపనిలో పడ్డారు. అయితే ఆ బ్యూటీ చిన్న సినిమాలలో నటించిందని సినిమా ఆఫర్ ల కోసం ఎదురు చూస్తోందని తెలిసింది. ఆర్జీవీ తో డ్యాన్స్ తరవాత వచ్చిన పాపులారిటీతో పలు యూట్యూబ్ ఛానల్స్ కు సైతం ఇంటర్వ్యూలు ఇచ్చింది.
కాగా ఓ ఇంటర్య్వూలో ఇనయ సంచలన విషయాలను చెప్పింది. తమ ఇంట్లో బయట ఉద్యోగానికి కూడా వెళ్లనివ్వలేదని చెప్పింది. అంతే కాకుండా తన పేరెంట్స్ తనను ఇండస్ట్రీలోకి కూడా రానివ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనాతో తన తండ్రి చనిపోయారని ఆ తరవాత ఇంట్లో వంద రూపాయలు తీసుకుని పారిపోయి వచ్చానని పేర్కొంది. ఇక తన పుట్టిన రోజున పిలిస్తే ఆర్జీవీ వచ్చారని…ఆయనకు నచ్చిన పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేశారని తెలిపింది.
అందులో ఓ వీడియో వైరల్ కాగా తన బంధువులు స్నేహితులు కూడా అసహ్యించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఏమైనా పోర్న్ వీడియోలు చేస్తున్నానా ? సినిమాల్లోనే నటిస్తున్నా కదా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతోనే ఇనయ సుల్తానాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. మరి ఈ బ్యూటీ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుంటుందా లేదా అన్నది చూడాలి.