టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు తండ్రి హరికృష్ణతో ఎంతో గొప్ప అనుబంధం ఉంది. అయితే ఈ అనుబంధం విషయంలో ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారన్నది నూటికి నూరు శాతం నిజం. హరికృష్ణకు తండ్రి ఎన్టీఆర్ పెళ్లి చేశారు.. మొదటి భార్యతో నందమూరి జానకిరామ్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కొడుకులు జన్మించారు. హరికృష్ణ జీవితం అలా హ్యాపీగా సాగుతున్న సమయంలో నందమూరి ఇంట్లోని పిల్లలకు సంగీతం నేర్పడానికి వచ్చిన శాలినితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.
అలా శాలినిని హరికృష్ణ తన రెండో భార్యగా స్వీకరించారు. ఆ దంపతులకు పుట్టిన వాడే మన జూనియర్ ఎన్టీఆర్. అయితే శాలినిని నందమూరి కుటుంబం చాలా రోజుల వరకు తమ ఇంటి కోడలిగా అంగీకరించలేదని అంటారు. ఎన్టీఆర్ దీనిని పెద్దగా పట్టించుకోకపోయినా నందమూరి కుటుంబంలో కొందరు శాలిని విషయంలో కాస్త పట్టుదల ధోరణితో ఉండడంతో చాలా రోజులపాటు ఆమె నందమూరి ఇంట్లోనే అడుగుపెట్టలేని పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్‌కు 10 ఏళ్ల వయసు వచ్చేవరకు గాని నందమూరి కుటుంబం శాలినిని అంగీకరించలేదని చెబుతుంటారు.
ఇక తండ్రికి దగ్గరైన ఎన్టీఆర్ చిన్న వయసులోనే గుణశేఖర్ దర్శకత్వంలో బాల రామాయణం సినిమాలో నటించారు. కేవలం 19 సంవత్సరాల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లకే మూడు సూపర్ డూపర్ హిట్లతో టాలీవుడ్ లో తిరిగిలేని స్టార్ హీరో అయిపోయాడు. ఇలా అన్నీ కలిసి వస్తున్నాయి అనుకుంటున్న సమయంలో పెళ్లి తర్వాత ఎన్టీఆర్ – హరికృష్ణకు నందమూరి కుటుంబంతో గ్యాప్ వచ్చింది. ఓవైపు ఎన్టీఆర్ వరుస ప్లాపుల్లో ఉన్న సమయంలో పెద్దన్నయ్య జానకిరామ్‌ను రోడ్డు ప్రమాదంలో కోల్పోయాడు.
జానకిరామ్ మరణం తర్వాత కళ్యాణ్ రామ్ – ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణతో కలిసి ఎంతో అనుబంధంతో ముందుకు సాగుతున్న సమయంలో హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదానికి బలైపోయారు. అలా ఎన్టీఆర్‌కు కెరీర్ ప్రారంభం నుంచి కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ వచ్చాయి. చివరి నాలుగైదు సంవత్సరాలు జానకిరామ్ మరణం తర్వాత కళ్యాణ్ రామ్‌తో హరికృష్ణతో ఎన్టీఆర్ ఎంతో ప్రేమతో అనుబంధంతో ఉండేవారు.
అయితే కళ్యాణ్ రామ్ స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తమ ఇద్దరు అన్నదమ్ములతో పాటు హరికృష్ణతో కలిసి ఒక సినిమా చేయాలని ఎన్టీఆర్‌కు ఎంతో కోరిక ఉండేది. అయితే ఆ కోరిక కలగానే మిగిలిపోయింది. ఆ కోరిక తీరకుండానే హరికృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ – కళ్యాణ్‌రామ్ కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వస్తుందో ? చూడాలి.