యంగ్ బ్యూటీ శ్రీలీల తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. ఆ సినిమాతోనే ఆమెకు తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. తెలుగు అమ్మాయి అయినా కన్నడలో సెటిల్ అయిన శ్రీలీల శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. అసలు తొలి సినిమా కూడా కేవలం ఆమె వల్లే హిట్ అయ్యిందన్న టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది. శ్రీలీలను చూసేందుకే కుర్రకారు థియేటర్లకు క్యూ కట్టడంతో పెళ్లిసందడి నెగటివ్ టాక్‌తో కూడా బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కేసింది.
ఇక ఇప్పుడు ఆమె చేతిలో తెలుగులోనే నాలుగైదు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాలో ఆమె బాలయ్య కూతురుగా నటిస్తోంది. రవితేజ ధమాకాలోనూ ఆమె అందాలతో కట్టిపడేయబోతోందని టీజర్ చెప్పేసింది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించే సినిమాలోనూ శ్రీలీలే హీరోయిన్. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు.
అయితే శ్రీలీలకు ఇక్కడ షూటింగ్లో పాల్గొనేందుకు వీలుగా ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో రూం ఏర్పాటు చేశారు. శ్రీలీలతో పాటు ఆమె తల్లి కూడా ఇక్కడే ఉంటుందట. అయితే ఈ ఫైవ్‌స్టార్ హోటల్లో ఖర్చులు అన్ని కలుపుకుంటే రోజుకు రు. 22 వేలు దాకా అవుతుందని తెలుస్తోంది. షూటింగ్ దాదాపుగా 25 రోజుల పైనే జరుగుతుందట. ఆమెకు ఇచ్చే రెమ్యునరేషన్ కాకుండానే ఇది నిర్మాతలు భరించాల్సిందే అట.
ఈ షెడ్యూల్‌తోనే ఆమె హోటల్ ఖర్చు రు. 7-8 లక్షలు అవుతోంది. ఆ తర్వాత మరో 20 రోజుల షెడ్యూల్ కూడా ఉందట. అప్పుడు కూడా ఆమెకే రు. 10 లక్షలు పైనే ఖర్చవుతుందని తెలుస్తోంది. ఏదేమైనా పెళ్లిసందడి సినిమాకు ముందు వరకు శ్రీలీల షూటింగ్‌కు వస్తే మామూలు హోటల్లోనే ఉండేదట. ఎప్పుడు అయితే రేంజ్ పెరిగి ఆఫర్లు వస్తున్నాయో… ఇప్పుడు ఆమె మరింత కాస్ట్ లీ అయిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.