టాలీవుడ్ లో 1990 కాలంలో స్టార్ హీరోయిన్‌గా రాణించిన వారిలో హాట్ హీరోయిన్ టబు కూడా ఒకరు. హైదరాబాదీ అమ్మాయి టబు అప్పట్లో తన అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లోనూ టబు సినిమాలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో తల్లి మరియు ఇతర పాత్రలు చేస్తూ టబు ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు జోడిగా టబు సినిమాలు చేశారు. నాగార్జున హీరోగా నటించిన నిన్నే పెళ్ళాడతా సినిమాలో టబు హీరోయిన్ గా నటించగా ఆమె నటనకు అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఈ సినిమాలో నాగార్జునతో టబు చేసిన రొమాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుందేమో. ఇద్దరూ నిజంగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారా ? అన్నంత రేంజ్ లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత టబు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇక అప్పట్లో నాగార్జున టబు లవ్ లో ఉన్నారంటూ కూడా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా టబు నాగార్జునను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని కానీ అది జరగకపోవడంతో జీవితంలోనే పెళ్లికి దూరంగా ఉన్నారని కూడా టాక్ వినిపించింది. ఆ తర్వాత మరోసారి వీరిద్దరు కలిసి ఆవిడా మా ఆవిడే సినిమాలో కూడా జోడీ కట్టారు.
ఇక ప్రస్తుతం టబు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురం సినిమాతో టబు సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఇక ఏజ్ పెరిగినా టబు అందం మాత్రం తరగడం లేదు. ఐదు పదుల వయసు దాటిపోయినా టబు కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. అదే రేంజ్ లో ఫిట్నెస్ కూడా మెయింటెయిన్ చేస్తున్నారు. ఇక తాజాగా టబు ఓ ఇంటర్వ్యూలో తన అందం సీక్రెట్ ను బయటపెట్టారు. తన అందం సీక్రెట్ ఏమీ లేదని టబూ పేర్కొన్నారు.
కానీ తమ ఇంట్లో ఉన్న కాఫీ మొక్కలు… ఇతర మొక్కల ఆకులను బ్యూటీ కోసం ఉపయోగిస్తానని చెప్పారు. అయితే ఓ మేకప్ ఆర్టిస్ట్ తనకు మీరు ఇలాంటివి ఉపయోగించకూడదు… ఒక క్రీమ్ ఉంది అది వాడండి అంటూ సలహా ఇచ్చాడని పేర్కొన్నారు. ఆ క్రీమ్ ధర రూ. 50 వేలు అని చెప్పారు. ఇక రూ.50 వేలు పెట్టి కొన్నప్పటికీ ఆ ఫేస్ క్రీంతో ఎలాంటి ఫలితం లేదని చెప్పింది. అంతేకాకుండా అలాంటివి ఎవరూ వాడకూడదని సూచించారు. సహజ సిద్ధంగా లభించేవాటిని వాడటం మంచిదని సలహా ఇచ్చారు.