Moviesఅందుకు ఒప్పుకో.. ముఖం పై డబ్బు విసిరిన ఆ స్టార్ డైరెక్టర్...వెక్కి...

అందుకు ఒప్పుకో.. ముఖం పై డబ్బు విసిరిన ఆ స్టార్ డైరెక్టర్…వెక్కి వెక్కి ఏడ్చిన సిమ్రాన్..!?

ఆమె ఓ అందాల బొమ్మ.. చూడ చక్కనైన ముఖం.. ఆకర్షించే కళ్ళు.. చూడగానే అట్రాక్ట్ చేసే పెదాలు.. దానిపై ఉండే పుట్టుమచ్చ.. ఎలాంటి రోల్స్ నైనా సరే ఇమిడిపోయినటించే మంచి టాలెంట్ ఉన్న ఏకైక నటి. ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుందిగా ..మరెవరో కాదు ..ఆమె పేరే సిమ్రాన్. అందం అభినయం కలగలిసిన ఓ ముద్దుగుమ్మ ఇటు గ్లామర్ రోల్స్.. అటు అభినయానికి రెండిటికీ సంబంధించిన సినిమాలను చూస్ చేసుకుంటూ.. తనలోని నటన బ్యాలెన్స్ చేస్తూ వెండితెరపై కొన్నాళ్లు రాజ్యమేలిన ఓ మహారాణి.


అబ్బాయిగారి పెళ్లి అనే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన సిమ్రాన్ ..ఆ తర్వాత సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ..కెరీర్ ని వరుసగా సినిమాలతో దూసుకుపోయేలా చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రియా ఓ ప్రియా, మా నాన్నకు పెళ్లి ,ఆటో డ్రైవర్, సమరసింహారెడ్డి, అన్నయ్య, కలిసుందాం రా , నువ్వొస్తావని ,యువరాజు ,మృగరాజు ,నరసింహనాయుడు ,ప్రేమతో రా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. మరీ ముఖ్యంగా సీతయ్య సినిమాలో హరికృష్ణ సరసన నటించి ఆ రోజుల్లో శభాష్ అనిపించుకుంది.


అయితే సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో సిమ్రాన్ కి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందట . అంతేకాదు మా నాన్నకు పెళ్లి సినిమా తర్వాత ఆమెను స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ గా అప్రోచ్ అయ్యారట. కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక సిమ్రాన్ ఆ డైరెక్టర్ కి నో చెప్పిందట. దీంతో ఆయన డబ్బులు సిమ్రాన్ ముఖం పై విసిరేసి ఎంత కావాలో అంత తీసుకో ..నా సినిమాకు ఓకే చేయ్” అంటూ దారుణంగా మాట్లాడారట. అప్పుడు సిమ్రాన్ ఏడ్చినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు అదే సిమ్రాన్ కూర్చొని తిన్న తరగని ఆస్తిని ఆమె సంపాదించుకుంది సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి. కాగా 2003 చిన్న నాటి ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సిమ్రాన్.. ఇప్పుడు ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది . వచ్చిన అవకాశాలతో నచ్చిన సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news