Moviesఆ క్రేజీ హీరో చేసిన చిలిపి పనితో సెట్లోనే భోబోరున ఏడ్చేసిన...

ఆ క్రేజీ హీరో చేసిన చిలిపి పనితో సెట్లోనే భోబోరున ఏడ్చేసిన రంభ…!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలు అంటేనే హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లు పడాల్సిందే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన సొంత బ్యాన‌ర్‌లోనే జెడి చక్రవర్తి – రంభ జంటగా `బొంబాయి ప్రియుడు` సినిమా వచ్చింది. `పెళ్లిసందడి` లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎవరైనా కొత్త హీరోతో సినిమా చేయాలని నిర్ణయించుకున్న రాఘవేంద్రరావు జేడీ చక్రవర్తితో పాటు అప్పటికే ఫామ్ లో ఉన్న రంభను హీరోయిన్‌గా తీసుకుని `బొంబాయి ప్రియుడు` సినిమా తెరకెక్కించారు.

ఈ సినిమాలో పాటలు అన్నీ మ్యూజికల్ గా సూపర్ హిట్ అయ్యాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఒకరోజు సినిమా షూటింగ్‌లో బత్తాయి పళ్ళు కిందకు దొర్లుకుంటూ వస్తుండగా ఓ పాట షూట్ చేస్తున్నారు. అదే పాటలో పైనాపిల్ పండు కూడా రాఘవేంద్రరావు వాడారు. అయితే జెడి చక్రవర్తి సరదాగా ఇప్పుడు నీ మీద బత్తాయి పళ్ళు వేయిస్తారు… ఆ తర్వాత ఇంత పెద్ద పుచ్చకాయ తీసుకువచ్చి వేయిస్తారని చెప్పడంతో రంభ ఫక్కున నవ్వేసింది అట.

 

ఓ వైపు రాఘవేంద్రరావు పాట షూటింగ్ కోసం తిప్పలు పడుతుంటే.. ఇటు హీరో, హీరోయిన్లు జోకులు వేసుకొని నవ్వులాడుకోవడంతో ఆయ‌న‌ సీరియస్ అయ్యారట. మీరు ఎంత సేపు ముచ్చట్లు పెట్టుకుంటారో పెట్టుకోండి.. ఎంతసేపు నవ్వుకుంటారో నవ్వుకోండి. మీరు నవ్వుకోవటం ఆపేసిన తర్వాతే తాను షూటింగ్ చేస్తానని చెప్పారట. రాఘవేంద్రరావు ఒక్కసారిగా అలా తనపై సీరియస్ అవ్వడంతో రంభ సెట్ లోనే భోరున ఏడ్చేసిందట‌.

తన తప్పు లేకుండా జె.డి చక్రవర్తి చేసిన పనితో తాను డైరెక్టర్‌తో అనవసరంగా మాట పడ్డానని ఆమె ఎంతో బాధపడిందట. చివరకు అక్క‌డున్న‌ వారు రంభ‌కు స‌ర్ది చెప్పాక తిరిగి రాఘవేంద్రరావు ఆ పాటను పూర్తి చేశారట. అలా `బొంబాయి ప్రియుడు` సినిమా షూటింగ్ టైంలో జెడి చక్రవర్తికి తనకు మధ్య ఎప్పుడు చిలిపి గొడవలు జరుగుతూనే ఉండేవని రంభ ఓ సందర్భంలో తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news