టాలీవుడ్ చందమామ కాజల్ .. ఓ అందాల బొమ్మ. చూడటానికి చక్కటి రూపం .. చూడగానే ఆకట్టుకునే అందం ఆమె సొంతం. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన కాజల్ . మొదటి సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న రెండో సినిమా మగధీరతో మాత్రం బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నుంచి కాజల్ తన లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది
టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ అన్ని భాషల్లోనూ కాజల్ నటిస్తూ కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ భారీగా ఆస్తులు ఏర్పరచుకుంది. కాగా హీరోయిన్ గా మంచి పొజిషన్లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ అంతే త్వరగా ఓ బిడ్డకు జన్మనిచ్చి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. సెకండ్ ఇన్నింగ్ స్ లో ఓ రేంజ్ లో ట్రై చేస్తున్న కాజల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మనకు తెలిసిందే కాజల్ అగర్వాల్ రానా దగ్గుబాటి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “నేనే రాజు నేనే మంత్రి”. ఈ సినిమాకి డైరెక్షన్ చేసింది మల్టీ టాలెంటెడ్ తేజ . ఆఫ్ కోర్స్ తేజ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఒకప్పుడు చేసిన సినిమాలు ఎంత హిట్ అయ్యాయో సినీ చరిత్రను ఎలా తిరగరాసాయో మనకు తెలిసిందే. కాగా చాలా కాలం గ్యాప్ తీసుకొని చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది . అంతేకాదు పాటలు యాక్షన్ కంటెంట్ మొత్తం జనాలకు బాగా నచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్లో కాజల్ అగర్వాల్ తో తేజ తప్పుగా మాట్లాడారట .
ఆమె రానా దగ్గుబాటి కలిసి రొమాంటిక్ సీన్ చేస్తున్న టైంలో తేజ ఆమెను కోప్పడ్డారట . “మీకు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం సరిగ్గా రాదా.. ఇంత వయసు వచ్చింది అప్పుడు ఎలాంటి స్పెషల్ ఇవ్వాలో తెలియదా …?”అంటూ కసిరారట దానికి స్పాట్లోనే కన్నీళ్లు పెట్టుకున్న కాజల్. ఆ తర్వాత డైరెక్టర్ తేజతోనే ఆ సీన్ చేసి శభాష్ అనిపించుకుందట. ఆయన నోరు మూయించేలా నెక్స్ట్ షాటే మంచి హోంలీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి శభాష్ అని క్లాప్స్ కొట్టించుకునేలా చేసిందట. మనకు తెలిసిందే తేజ కోపం చిన్నపాటిది కొందరు హీరోయిన్స్ ను చెయ్యి ఎత్తి కొట్టిన ఘనత కూడా ఉందంటున్నారు సినీ వర్గాలల్లో ఆయనకి. అలా కాజల్ తన పర్ఫామెన్స్ తో తేజ నోరు మూయించిందని అప్పట్లో మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.