యస్ ఇప్పుడు ఇదే మాటలు అనిల్ రావిపూడి పై వైరల్ గా మారాయి. రీసెంట్ గా ఆలీతో సరదాగా షో కి గెస్ట్ గా వచ్చిన సీనియర్ బ్యూటీ సంగీత చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ప్రకంపనులు సృష్టించాయి. మనకు తెలిసిందే సంగీత ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ బ్యూటి.. తన ట్రెడిషనల్ అందాలతో తన బబ్లీ లుక్స్ తో క్యూట్ స్మైల్ తో కుర్రాలను ఫిదా చేసింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న సంగీత ఈ మధ్యనే తన రీ ఎంట్రీని ఘనంగా ప్రారంభించింది.
సెకండ్ ఇన్నింగ్స్ లోను ఏమాత్రం అందాల జోరు తగ్గనీయకుండా హాట్ ఫిజిక్ తో సెక్సీ లుక్స్ తో కుర్రాలను కట్టిపడేస్తున్న సంగీత.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో సంగీత హీరోయిన్ రష్మిక మందన తల్లిగా నటించింది. అంతేకాదురష్మిక తో పోటీపడి అందాల ప్రదర్శన ఇచ్చింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక నటన కన్నా సంగీత నటనే బాగుంది అంటూ మెచ్చుకున్నారు జనాలు . అంతలా ఆమె తన యాక్టింగ్ తో జనాలను మెప్పించగలరు.
రీసెంట్ గా మసూదా అనే సినిమాలో ఓ రోల్ చేసిన సంగీత.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా గేమ్ షో కి గెస్ట్ గా వచ్చింది. ఈ క్రమంలోని అనిల్ రావిపూడి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఆలీ ఆమెను అడుగుతూ..” సరిలేరు నీకెవ్వరు” సినిమాలో హీరోయిన్ మదర్ గా చేశారు కదా అది మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా..?” అంటూ అడిగాడు. దీనికి ఆమె సమాధానం చెబుతూ..” రెండు అయ్యాయి మొదట. నేను ఈ కథను వినగానే అనిల్ రావిపూడి ని నోటికొచ్చినట్లు తిట్టేశాను. రేయ్ ఇలా చేసావ్ ఏంట్రా నన్ను అని తిట్టుకున్నాను .
అప్పుడేంటి ఇప్పుడు కూడా తిట్టుకుంటున్నాను . ఇకపై కూడా తిట్టుకుంటాను అనిల్ రావిపూడిని తలుచుకుంటుంటే తిట్టకుండా ఉండలేకపోతున్నాను” అంటూ సరదాగా కామెంట్ చేసింది. దీనితో అనిల్ రావిపూడి పై సంగీత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే సరిలేరు నీకెవ్వరు చిత్రంలో సంగీత ముగ్గురు పిల్లలకు తల్లిగా నటించింది. “నెవర్ బిఫోర్ ఎవ్వరు ఆఫ్టర్ ” అనే డైలాగ్ సంగీత చెప్తే జనాలు ఊగిపోయారు. పూనకాలు వచ్చినట్టు అంత ఫేమస్ అయింది.