Moviesఉద‌య్ కిర‌ణ్ ఫ‌స్ట్ బ్రేక‌ప్ తెలిసి కూడా చిరు త‌న కుమార్తె...

ఉద‌య్ కిర‌ణ్ ఫ‌స్ట్ బ్రేక‌ప్ తెలిసి కూడా చిరు త‌న కుమార్తె సుస్మిత‌తో ఎందుకు పెళ్లి చేయాల‌నుకున్నాడు…?

టాలీవుడ్ లో దివంగత వర్థ‌మాన హీరో ఉదయ్ కిర‌ణ్ ఒక్కసారిగా తారాజువ్వలా దూసుకు వచ్చి అంతే వేగంగా వెనక్కు వెళ్లిపోయాడు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి మూడు వ‌రుస‌ సూపర్ డూపర్ హిట్ సినిమాలతో ఉదయ్ కిర‌ణ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పట్లో ఉదయ్ కిరణ్ క్రేజ్ చూసి స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోయారు. ఉద‌య్ కిర‌ణ్ ను తొక్కేసేందుకు కుట్రలు కూడా జరిగాయి అన్న ప్రచారం అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించింది. ఉదయ్ కిరణ్ తనకు ఎంత స్టార్డమ్ వచ్చినా, ఎప్పుడు ఒదిగి ఉండేవాడు. పెద్దలతో వినయంగా మెలిగేవాడు. అయినా విధి ఉద‌య్ కిర‌ణ్ తో ఆడిన వింత నాటకంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.

ఉదయ్ కిరణ్ కు చిరు పెద్ద కుమార్తె సుస్మితతో ఎంగేజ్మెంట్ జరిగాక, అది పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ అయ్యింది. అంతకంటే ముందు ఉదయ్ కిరణ్ ఓ మహిళ జర్నలిస్టుతో ప్రేమలో పడ్డాడు. ఆమెను పిచ్చిపిచ్చిగా ప్రేమించాడు. `మనసంతా నువ్వే` సూపర్ డూపర్ హిట్ అయ్యాక తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఓ మహిళా జర్నలిస్టుతో ఉదయ్ కిరణ్ కు పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య మాటలు కలవడంతో అది ప్రేమగా మారింది.

అయితే చిన్న చిన్న మనస్పర్ధల నేపథ్యంలో ఆ మహిళ జర్నలిస్టు ఉదయ్ కిరణ్ కు బ్రేకప్ చెప్పేసింది. ఉద‌య్ కిర‌ణ్ మాత్రం ఆమెను తన భార్య‌గా చేసుకోవాలన్న ఊహలోకంలో గడిపాడు. చివరకు ఆమెతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్లి బ్రతిమిలాడడంతో పాటు వాళ్లను ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. అలా ఉదయ్ కిరణ్ తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవికి సైతం చెప్పి ఎంతో బాధపడేవాడట.

అప్పుడు చిరంజీవి ముందు `నీకు కెరీర్ ముఖ్యం కెరియర్ మీద దృష్టిపెట్టు` ఇవన్నీ మామూలే అని సర్ది చెప్పారట. ఆ సమయంలో ఉదయ్ కిరణ్ పై చిరంజీవికి ఇంప్రెషన్ కలగడంతో తన పెద్ద కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. విచిత్రం ఏంటంటే సుస్మిత స్వయంగా ఉద‌య్ కిర‌ణ్ ను ఇష్టపడిందంట. ఈ విషయాన్ని చిరు స్వయంగా ఉదయ్ కిరణ్ కుటుంబానికి చెప్పారు. ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి కూడా చిరు ఇంటికి వెళ్లి చిరు కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేసుకుందట.

 

వాళ్ల‌ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఎంగేజ్మెంట్ తర్వాత ఇద్దరి మధ్య ఏవేవో తేడాలు రావడంతో చివరకు అది పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ అయ్యింది. అలా ఉదయ్ కిరణ్ ఫస్ట్ బ్రేకప్ తెలిసిన కూడా, ఉద‌య్ కిర‌ణ్ మనస్తత్వం గురించి తెలిసిన చిరు తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. ఈ విషయాన్నిఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news