Moviesఐసీయూలోకి హీరో గోపీచంద్ కెరీర్‌... ఇంత‌క‌న్నా ఫ్రూప్ కావాలా చూడండి...!

ఐసీయూలోకి హీరో గోపీచంద్ కెరీర్‌… ఇంత‌క‌న్నా ఫ్రూప్ కావాలా చూడండి…!

గొప్ప పేరున్న దర్శకుడు టి కృష్ణ కొడుకు గోపీచంద్. రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నాడు. కెరీర్ ప్రారంభంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్, ఆ తర్వాత హీరోగా మారాడు. రెండు దశాబ్దాల కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించాడు. అందులో హిట్ సినిమాలు ఎన్ని ? అని చూస్తే వేళ్ళ మీద లెక్కపెట్టేలా ఉంటాయి. గోపీచంద్ ప్లాప్‌ సినిమాల్లో నటించడం తప్పు కాదు.. కానీ సగటు తెలుగు దరిద్రపు బిల్డప్పుల కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. గొప్పగా హీరోయిజం చూపించాలన్న తాపత్రయంతో అదే తరహా సినిమాలు చేస్తూ ఎదురు దెబ్బలు తింటున్నాడు.

ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్న గోపీచంద్ తల‌రాత మాత్రం మారటం లేదు. అతడికి ఒక్క హిట్టు రావడం లేదు. చివరకు గోపీచంద్ క్రేజ్ ఘోరంగా పడిపోయింది. తాజాగా గోపీచంద్ నుంచి వచ్చిన కళాఖండం `పక్కా కమర్షియల్` థియేటర్లలో చూసే వాళ్ళు లేక ఘోరంగా బాల్చి తన్నేసింది. ఒకప్పటి బూతు దర్శకుడు మారుతి తన మార్కు కామెడీ, హీరో యాక్షన్లు కలగలిపి వండిన వంటకమే `పక్కా కమర్షియల్`. పైగా గీతా వారి నిర్మాణం రాశీఖ‌న్నా అందాలు ఇలా భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాకు వచ్చిన టాక్ చూసిన జనాలు థియేటర్ల దాకా వెళ్లి డబ్బు తగలేసుకోవ‌డం ఎందుకు ?అనుకుని లైట్ తీసుకున్నారు. అయితే `పక్కా కమర్షియల్` స్టార్ మా టీవీ భారీ రేటుకు కొనుగోలు చేసింది. తాజాగా ఈ సినిమాను ప్రీమియర్ షో గా ప్రచారం చేసింది. ఈ సినిమాకు వచ్చిన రేటింగ్ పరమ నాసిరకం సీరియల్ కన్నా తక్కువగా ఉంది. కేవలం 2.44 రేటింగ్ వచ్చిందంటే ఈ సినిమాను టీవీల్లో కూడా చూసేందుకు జనాలు ఎంత అనాసక్తితో ఉన్నారో అర్థమవుతుంది. దీనిని బట్టి గోపీచంద్ కెరీర్ ఎంత పతనావస్థలో ఉందో తెలుస్తోంది.

గోపీచంద్ నుంచి ఇలాంటి సినిమా మరొకటి వస్తే చాలు ఇక గోపీచంద్ కెరీర్ ఐసీయూలో పడిపోయినట్టే. అనసూయ, రశ్మి లాంటి వాళ్లు టీవీ ప్రోగ్రాములు చేస్తుంటేనే రేటింగులు పేలిపోతున్నాయి. అలాంటిది ఓ హీరోగా 20 ఏళ్ల పాటు ఉన్న గోపీచంద్ సినిమాకు ఇంత దారుణమైన రేటింగ్ అంటే.. గోపీచంద్ ను జనాలు క్రమక్రమంగా మర్చి పోతున్నట్టే కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news