దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హీరో అయిపోయాడు. ఈ సినిమాలో దుల్కర్ చేసిన పాత్ర తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది అనటంలో సందేహం లేదు. ఎంతోమంది తెలుగు హీరోలు ఉన్నా ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు పట్టుబట్టి మరీ దుల్కర్‌నే ఎందుకు తీసుకున్నారో సినిమా చూసిన వారికి అర్థమవుతుంది. ఒక మలయాళ హీరో అయి ఉండి కూడా అచ్చ తెలుగు హీరోలా దుల్కర్ సీతారామం సినిమాలో ఒదిగిపోయాడు. ఇక దుల్కర్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే మలయాళంలో స్టార్ హీరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న ముమ్ముట్టి తనయుడు.
దుల్కర్ సల్మాన్ కేరళలో 1986 జులై 28న జన్మించాడు. తన తండ్రి సినిమా రంగంలో ఉండడంతో చిన్నప్పటినుంచి దుల్కర్ సినిమా వాతావరణంలో పెరిగాడు. అందుకే పెద్దయ్యక హీరో అవ్వాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు. అందుకు తగినట్టుగా ఎంతో కష్టపడ్డాడు. దుల్కర్ చిన్న వయస్సులోనే మంచి హిట్లతో మళయాళంలో స్టార్ అయిపోయాడు. తర్వాత సౌత్ మొత్తం క్రేజీ హీరో అయ్యాడు.
దుల్కర్ 2011 డిసెంబర్ 22న చెన్నైకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ అమల్ సుఫియాను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది. దుల్కర్ 2012లో సెకండ్ షో అనే మళయాళ సినిమాతో తెరంగ్రేటం చేశాడు. దుల్కర్ రెండో సినిమాతోనే జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యాడు. దుల్కర్ రెండో సినిమా ఉస్తాద్ హోటల్ ఉత్తమ వినోద చిత్రంగా అవార్డు గెలుచుకుంది.
ఓకే బంగారం, మహానటి, కనులు కనులు దోచాయంటే సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ఇంటి హీరో అయిపోయాడు. మహానటి సినిమాతో సౌత్ ఇండియాతో పాటు అటు నార్త్‌లోనూ దుల్కర్‌కు తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. 2013, 2014లో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా కొచ్చి టైమ్స్ పత్రికకు ఎంపికయ్యాడు.