నందమూరి వంశంలో మూడో తరం హీరోలుగా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రేసులో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. `త్రిబుల్ ఆర్` సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా బింబిసార సినిమాతో సూపర్ హిట్ కొట్టి ట్రాక్ ఎక్కాడు. ఇక ఇదే వంశం నుంచి గతంలో తారకరత్న, చైతన్య కృష్ణ కూడా హీరోలుగా చేశారు.
ఇప్పుడు నందమూరి వంశంలో మూడోతరం హీరోగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య వందో సినిమా `గౌతమీపుత్ర శాతకర్ణి` సినిమా టైమ్ నుంచే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తలు వస్తున్నా.. ఇప్పటివరకు ఇంకా మోక్షజ్ఞ ఎంట్రీ జరగలేదు. ఈ ఐదారేళ్లలో మోక్షజ్ఞ గురించి కుప్పలు తిప్పలుగా ఎన్నో వార్తలు వచ్చాయి. ఒక్కోసారి మోక్షజ్ఞ లుక్ చూసిన అభిమానులు కూడా డిసప్పాయింట్ అయ్యేవారు. రీసెంట్ గా మోక్షజ్ఞ కాస్త సన్నబడి హీరో లుక్ లోకి రావడంతో నందమూరి అభిమానులు ఆశల పల్లకిలో ఉన్నారు.
ఎన్ని వార్తలు వస్తున్నా… రోజులు గడిచిపోతున్న ఇంకా మోక్షజ్ఞ హీరోగా లాంచ్ కాక పోవడంతో నందమూరి అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు సినీ లవర్స్ కూడా నిరాశలోనే ఉన్నారు. ఘనమైన నందమూరి లెగసీని ఈ తరం పాటు కంటిన్యూ చేసేంత పెద్ద బాధ్యత మోక్షజ్ఞ మీద ఉంది. ఓవైపు మోక్షజ్ఞ ఫైట్లు, డ్యాన్సుల్లో, నటనలో అమెరికాలో శిక్షణ పొందుతున్నాడు. మరోవైపు వారసుడి కోసం బాలయ్య కథలు వింటున్నాడు. ఇంత జరుగుతున్నా మోక్షజ్ఞ వెండి తెరంగ్రేటంపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. ఇందుకు కేవలం బాలయ్య జాతకాల సెంటిమెంటే ఇప్పటివరకు అడ్డంకిగా మారుతూ వచ్చిందని తెలుస్తోంది.
బాలయ్య జాతకాలు బాగా నమ్ముతాడు. అందుకే తన వారసుడు లాంచింగ్ కోసం సరైన ముహూర్తం, సరైన సమయం కోసమే ఇప్పటివరకు వెయిట్ చేస్తూ వచ్చాడని తెలుస్తోంది. ఆ ఒక్క కారణంతోనే మోక్షజ్ఞ ఇప్పటివరకు లాంచ్ కాలేదని.. వచ్చే ఏడాదిలో మంచి ముహూర్తం ఫిక్స్ అయిందని.. 2023లో మోక్షజ్ఞ బాలయ్య వారసుడిగా.. టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖరారైందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే 2023 ఫిబ్రవరి లేదా మార్చ్ లో షూటింగ్ ప్రారంభించి వచ్చేయాడాదిలోనే మోక్షజ్ఞ డెబ్యు సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.