సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది కామన్ ప్రజలు కూడా సెలబ్రెటీల అవతారం ఎత్తారు. కొంతమంది అయితే ప్రస్తుతం సినిమాలు టీవి షోలతో ఫుల్ బిజీగా ఉన్నారు. యాంకర్ అషు రెడ్డి కూడా ఒకప్పుడు టిక్ టాక్‌లో జూనియర్ సమంత గా ఫేమస్ అయ్యింది. ఆ తరవాత బుల్లి తెరపై యాంకర్ గా ఆఫర్ అందుకుంది. ఇక ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇచ్చిన గలాటా గీతూ కూడా ఒకప్పుడు టిక్ టాక్ వీడియోలతోనే పాపులారిటీ సంపాదించుకుంది.
అంతే కాకుండా బిగ్‌బాస్ పై రివ్యూ లు ఇస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. చిత్తూరు యాసలో గడగడా మాట్లాడుతూ గలాటా గీతూగా ఫేమస్ అయ్యింది. ఒక అప్పట్లో గలాటా గీతూ ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అల్లు అర్జున్ తన ఫేవరెట్ హీరో అని చెప్పింది. అల్లు అర్జున్ అంటే చేయి కోసుకుంటా అంటూ వ్యాఖ్యానించింది. మాట్లాడటం అంటే ఇష్టం అని అందుకే ఆర్జేగా చేయాలనుకున్నట్టు తెలిపింది. అంతే కాకుండా బడా బ్యానర్ ల నుంచి కూడా తనకు సినిమా అవకాశాలు వచ్చాయంటూ చెప్పింది.
అయితే తనకు యాక్టింగ్ రాదు అని చెప్పి ఆ సినిమాలను వదులుకునట్టు తెలిపింది. ఆ తరవాత రెండు చిన్న సినిమాల్లో నటించినట్టు చెప్పింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీ వచ్చి కొద్ది రోజులు కూడా గడవకముందే కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. తనకు ఓ చేదు అనుభవం ఎదురైంది అని తెలిపింది. ఆస్ట్రేలియాలో ఈవెంట్ కోసం ఫోన్ చేశారని తెలిపింది. తనకు హోస్టింగ్ అంటే ఇష్టం అని అందుకే ఒప్పుకున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియా కాబట్టి షాపింగ్ చేసుకోవచ్చు… రెమ్యురేషన్ కూడా ఎక్కువే ఇస్తా అనడంతో వెంటనే ఓకే చెప్పినట్టు తెలిపింది.
టికెట్ బుకింగ్ సమయానికి మేనేజర్ పీఏ ఫోన్ చేసి…మా మేనేజర్ తో పర్సనల్ గా మీకు ఓకే కదా ఎక్కువ డబ్బులు ఇస్తాం అని అడిగాడు అని తెలిపింది. దాంతో ఒకసారి గా తన మైండ్ బ్లాక్ అయ్యి ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నట్టు చెప్పింది. ఈ గ్లామర్ రంగంలో ఇలాంటివి ఇప్పుడు బాగా ఎక్కువయ్యాయని కూడా ఆమె వాపోయింది.