ఈ టైటిల్ నిజంగానే ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. టాలీవుడ్‌లో బలమైన అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. అటు తాత దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఆయన బలమైన లెగసీని ఆయన వారసుడిగా నాగార్జున కంటిన్యూ చేస్తున్నారు. నాగార్జున కూడా స్టార్ హీరోగా నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఇప్పుడు ఇదే ఫ్యామిలీలో మూడో తరం హీరోలుగా నాగచైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు.
వీరిలో నాగచైతన్య ఇప్పటికే హీరోగా నిలదొక్కుకున్నాడు. నాలుగు వరుస ప్లాపుల తర్వాత బాలీవుడ్ ఆశలతో చేసిన లాల్‌సింగ్ చద్దా ప్లాప్ అయ్యింది. ఇక ఆ తర్వాత థ్యాంక్యూ కూడా ప్లాప్ అయ్యింది. చైతు హీరోగా అయితే నిలదొక్కేసుకున్నాడు. ఇటు రెండో కుమారుడు అఖిల్ నాలుగు సినిమాలు చేస్తే మూడు ప్లాపులు.. ఒక్కటే హిట్.
ఇక ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే రు. 80 కోట్ల బడ్జెట్ అయ్యిందంటున్నారు. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు. గత ఆరేడు నెలల నుంచి రిలీజ్ అంటున్నా వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. ప్రస్తుతానికి కూడా మేకర్స్ నుంచి అయితే రిలీజ్ కి సంబంధించి ఏం మాట్లాడడం లేదు.
దీనిని బట్టి చూస్తుంటే ఇప్పట్లో ఏజెంట్ రిలీజ్ కాదనే అంటున్నారు. ఏదేమైనా అఖిల్ కెరీర్‌పై నాగ్ ఎంత ఫోకస్ పెడుతున్నా వర్కవుట్ కావడం లేదు. అఖిల్‌ను ఇంత బ్యాడ్ లక్ ఎందుకు వెంటాడుతుందో ? అర్థం కావడం లేదు.