అన్నగారు సినిమా రంగంలో ఉన్నప్పుడు.. తర్వాత.. రాజకీయాల్లోకి వచ్చాక కూడా.. ఆయన జాగ్రత్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఎక్కడా అదనంగా ఖర్చు చేయాలని అనుకునేవారు కాదు. ఆర్థిక వ్యవహారాల విషయంలో ఎన్టీఆర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకుని.. పొదుపుగా ఉండే వ్యవహారంవైపే..అడుగులు వేసేవారు. తొలినాళ్లలో మద్రాస్‌లో ఆయన అందరితో కలిసి రూంలో ఉండేవారు. అయితే.. అది కూడా సర్దుకుని ఉండేవారట.
ఎందుకంటే.. అప్పటికే ఉన్న పేకేటి శివరాం, కస్తూరి శివరావు.. వంటివారు. మహ జల్సా రాయుళ్లుగా పేరు తెచ్చుకున్నారు. చేతిలో ఎంత ఉన్నా ఖర్చు పెట్టేవారట. అంతేకాదు.. తమతోటి వారితోనూ ఖర్చు చేయించేవారు. ఈ క్రమంలోనే వారు.. ఖరీదైన ఇళ్లలో రూంలు తీసుకుని ఉండేవారట. ఆ సమయంలోనే అన్నగారిని కూడా ఆహ్వానించారట. కానీ, అంతంత ఖరీదైన చోట తాను ఉండలేనని.. మొహమాటం లేకుండా.. చెప్పేశారట.
అంతేకాదు.. అప్పులు చేయడం.. నాకు ఇష్టం లేదు! అని చెప్పేవారట. అప్పట్లోనే ఆయన చిన్న చిన్నగా డబ్బు వెనకేసుకుని తన స్వగ్రామం నిమ్మకూరులో పొలాలు కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన అత్యత తక్కువ అద్దె తీసుకునే రూంల కోసం.. వెతికి మరీ పట్టుకుని.. అక్కడ ఉన్న సందర్భాలు ఉన్నాయని.. గుమ్మడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అంతేకాదు.. ఎక్కిడికైనా వెళ్లాల్సి వచ్చినా.. అన్నగారు.. ఆచి తూచి అడుగులు వేసేవారట. ఉదయం షూటింగుకు వెళ్లే సమయంలో మాత్రం బస్సును ఆశ్రయించేవారట.
కానీ, సాయంత్రం షూటింగు అయిపోయిన తర్వాత.. మాత్రం.. తన రూంకు 5 కిలో మీటర్ల లోపే ఉంటే.. నడిచి వచ్చేసేవారట. వ్యాయామానికి వ్యాయామంగానూ.. ఉంటుందని చెప్పేవారట. ఇలా.. తొలి నాళ్లలో అన్నగారు చాలా పొదుపుగా వ్యవహరించినట్టు.. తెలుస్తోంది. తర్వాత.. కాలంలోనే ఆయన పుంజుకున్నారు. అయినా.. అప్పుడు కూడా ఆయన పాటించిన పొదుపు మంత్రం.. ఆయనను ఇబ్బందులకు గురి కాకుండా చేసిందట.