చిత్రపరిశ్రమలో పెళ్లిళ్లు విడాకులు కామన్. అయితే కొంతమంది తమ పార్ట్ నర్ తో విడిపోయి సింగిల్ గా ఉండిపోతే మరికొందరు మాత్రం ఒంటరిగా ఉండలేక రెండో పెళ్లి చేసుకుంటారు. ఆ లిస్ట్ లో విలక్షణ నటుడ ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడు. ప్రకాష్ రాజ్ సీరియల్స్ లో నటిస్తూ కెరీర్ ను ప్రారంభించి విలక్షణ నటుడుగా ఎదిగారు. తమిళ నటుడు అయినప్పటికీ టాలీవుడ్ లో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఒక్కడు సినిమా ప్రకాష్ రాజ్ కు టర్నింగ్ పాయింగ్ గా మారింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్ విలక్షణ విలనిజం ఇండస్ట్రీనే ఊపేసింది.
ఆ తరవాత చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం తెలుగుతో పాటూ బాలీవుడ్, కోలీవుడ్ లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ప్రకాష్ రాజ్ మొదట లలిత కుమారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు జన్మించాడు. లలితకుమారి ఎవరో కాదు.. దివంగత రియల్‌స్టార్ శ్రీహరి భార్య శాంతికి స్వయానా సోదరి.
ప్రకాష్ రాజ్ కుమారుడు చిన్నవయసులోనే అనారోగ్యంతో మరణించాడు. ఆ తరవాత ప్రకాష్ రాజ్ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే బాబు మృతి చెందాడని ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయి. అవి కాస్తా చివరకు విడాకులకు దారి తీశాయి. ఇక లలిత కుమారితో విడాకుల తరవాత ప్రకాష్ రాజ్ ఎక్కువ కాలం సింగిల్ గా గడపలేదు. వెంటనే బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోని వర్మను పెళ్లి చేసుకున్నాడు. పోనివర్మ తెలుగువారికి పెద్దగా పరిచయం లేదు కానీ బాలీవుడ్ లో చాలా పాపులర్. చాలా సినిమాలకు పోనివర్మ బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.
అంతే కాకుండా 20 ఏళ్లపాటూ చిత్రపరిశ్రమలో ఆమె టాప్ కొరియోగ్రాఫర్‌గా ఉన్నారు. హిందీలో పాపులర్ డ్యాన్స్ షోలకు పోనివర్మ జడ్జిగా వ్యవహరించారు. ఇక తెలుగులో పోనివర్మ బద్రీనాథ్ సినిమాకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కొంతకాలం పాటూ డేటింగ్ చేశారు.
ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాక 2010 ఆగస్టులో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన రెండో భార్య మాజీ భార్య కలిసి మాట్లాడుకుంటారని చెప్పాడు.తాను మాజీ భార్య వద్దకు వెళతానని ఆమెకు తను ఓ స్నేహితుడిలా ఉంటానని అన్నారు. తన కూతుళ్లు కూడా ఇంటికి వస్తారని చెప్పాడు.