టాలీవుడ్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది చరిత్రలో నిలిచిపోయే ప్రస్థానం. శతాధిక చిత్రాల దర్శకుడుగా పేరున్న రాఘవేంద్రరావు మూడు తరాల హీరోలతో సినిమాలు చేసిన ఘనత దక్కించుకున్నారు. పౌరాణికం, చారిత్రకం, సాంఘీకం, జానపదం, భక్తిరస చిత్రాలు ఇలా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి సూపర్ హిట్ లు కొట్టారు. ఎంతోమంది స్టార్ హీరోలకు సైతం రాఘవేంద్రుడు లైఫ్ ఇచ్చారని చెప్పాలి. ఇక రాఘవేంద్ర రావు వ్యక్తిగత జీవితం గురించి ఓ విషయం గత కొంతకాలంగా బాగా వైరల్ అవుతుంది.
రాఘవేంద్రరావు తండ్రి సీనియర్ దర్శకుడు కే ఎస్ ప్రకాష్ రావు. అక్కినేని నాగేశ్వరరావు కెరియర్లో తిరుగులేని బ్లాక్ బస్టర్ `ప్రేమనగర్` సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. గత కొంతకాలంగా రాఘవేంద్రరావు తల్లి సీనియర్ నటి వరలక్ష్మి తన భర్తను వదిలేసి.. తన కింద పనిచేసే ఓ పహిల్వాన్తో వెళ్లిపోయిందన్న వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది రాఘవేంద్రరావు తల్లి పహిల్వాన్‌తో లేచిపోయిందని చిలువలు పలువులుగా వార్తలు రాస్తున్నారు. అయితే ఇది పూర్తిగా అవాస్తవం.
కే ఎస్ ప్రకాష్ రావుకు వరలక్ష్మి రెండో భార్య. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు. ఆమె సినిమాల్లోకి రాకముందు నాటకాలు వేసేవారు. అక్కడ నుంచి ఆమె కె ఎస్. ప్రకాష్ రావు ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో వరలక్ష్మిని కేఎస్. ప్రకాష్ రావు రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఆయనకు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రకాష్ రావుకు మొదటి భార్య ద్వారా మురళీమోహన్‌రావు, రాఘవేంద్రరావు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వరలక్ష్మికిని పెళ్లి చేసుకున్నాక ఒక కుమార్తెతో పాటు మరో కుమారుడు కూడా పుట్టాడు.
వరలక్ష్మి తన కుమారుడికి తన భర్త పేరునే కెఎస్. ప్రకాష్ అని పెట్టుకుంది. ఆ కే ఎస్ ప్రకాష్ విన్సెంట్ దగ్గర అసిస్టెంట్ సినిమాటో గ్రాఫర్ గా పనిచేసి ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ అయ్యారు. మోహన్ బాబు హీరోగా వచ్చిన `రౌడీ గారి పెళ్ళాం` సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆ తర్వాత కే ఎస్ ప్రకాష్ రెండో సినిమా కూడా మోహన్ బాబుతోనే చేశారు. అయితే చిన్న వయసులోనే ఆయన మృతి చెందారు. తన సవతి తల్లి కొడుకు అయినా కూడా ప్రకాష్ అంటే రాఘవేంద్రరావు ఎంతో ఇష్టపడేవారు.
ఆయన మరణం తర్వాత ఆయన కుటుంబ బాధ్యతలతో పాటు వాళ్ల ఫ్యామిలీని అనేక విధాలుగా ఆదుకున్నారు రాఘవేంద్రరావు. తన తండ్రికి రెండో భార్య అయినా కూడా వరలక్ష్మి అంటే రాఘవేంద్రరావు ఇష్టంగానే చూసుకునేవారు. అయితే వరలక్ష్మీ వయసులో ఉన్నప్పుడు తన భర్తను వదిలేసి పహిల్వాన్‌తో వెళ్లిపోయారు. అది అటు సీనియర్ దర్శకుడు కే ఎస్ ప్రకాష్ రావు జీవితంలో ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది. అయితే వరలక్ష్మి రాఘవేంద్రరావుకు సవతి తల్లి అన్న విషయం తెలియక చాలామంది రాఘవేంద్రరావు తల్లి వెళ్ళిపోయింది.. అని రాస్తూ ఉంటారు. దీని వెనక అసలు వాస్తవం ఇదే..