సినీ రంగంలో ఒక్కొక్క సారి పొరపాట్లు కూడా చోటు చేసుకుంటూ.. ఉంటాయి. ఆ పొరపాట్లు..ఎంతవరకు వెళ్తాయంటే.. నటుల ప్రాణాల మీదకు తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు.. బామ్మ మాట.. బంగారు బాట.. సినిమా సమయంలో జరిగిన పొరపాటుతో నూతన్ ప్రసాద్.. రెండు కాళ్లు కోల్పో యారు. ఇలా.. కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల.. కూడా.. అనేక సంఘటనలు వెలుగు చూశాయి.
అయితే.. ఇవి పొరపాట్లు.. కానీ.. కొన్ని కొన్ని ఘటనలు మాత్రం ప్రొడక్షన్ మేనేజర్ నిర్లక్ష్యం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటికి ప్రత్యక్ష ఉదాహరణ.. అన్నగారు ద్విపాత్రాభినయంలో ఉర్రూత లూగించిన.. యుగంధర్ సినిమా. ఈ సినిమాలో అన్నగారు.. విశ్వరూపం ప్రదర్శించారు. ఒక సందర్భంలో పోలీసులనుంచి తప్పించుకునేందుకు.. మద్యం దుకాణంలోకి వెళ్లిపోతాడు హీరో. ఈ సమయంలో ఒక కిళ్లి వేసుకుని.. పాట పాడే సీన్ ఉంటుంది.
`ఓరబ్బ.. వేసుకున్నా.. కిళ్లీ.. అరెఅరె.. ఒళ్లంత తిరిగెను మళ్లీ!“అనేది పాట. ఈ సమయంలో అన్నగారు కిళ్లీలు.. ఒకదానిమీద ఒకటి వేసుకుని.. కనిపించాలి. దీనిని షూట్ చేసేందుకు అంతా ఓకే అయింది. అప్పటికే.. ప్రొడక్షన్ మేనేజర్ కిళ్లీలను తెప్పించారు. సాధారణంగా.. అన్నగారు.. కిళ్లీ వేసుకుంటారు. కానీ.. ఈ సమయంలో.. ప్రొడక్షన్ మేనేజర్.. మిఠాయి కిళ్లీలు తెప్పించాల్సింది పోయి.. కారా కిళ్లీలు తెప్పించారు. పైగా. నోరు వెంటనే పండాలని చెప్పడంతో..కొట్టువాడు.. సున్నం వేయకుండా.. పోసేశాడు.
ఇంకేముంది.. ఈ విషయం తెలియక అన్నగారు.. షూటింగ్‌లో భాగంగా.. ఒకదాని వెంట ఒకటి.. దాదాపు 5 కిళ్లీలు అన్నగారు నమిలేశారు. దీంతో ఒక్కసారిగా.. అన్నగారి నోరంతా పొక్కిపోయింది. రెండు రోజుల పాటు.. ఇష్టమైన మాంసాహారం తిన్నా.. రుచి తెలిసేది కాదట. దీంతో రెండు రోజులు ఆయన పళ్ల రసాలతోనే సరిపెట్టుకున్నారట. అయితే.. ఇంత జరిగినా.. అన్నగారు ఎవరిపైనా కోప్పడలేదు. పైగా.. కారా కిళ్లి వేసుకున్నాను కాబట్టి..పాట అంత హాట్ హాట్‌గా వచ్చిందని వ్యాఖ్యానించారట.