Moviesత్వరలోనే సమంత రెండో పెళ్లి..సద్గురు బాబా సంచలన ప్రకటన..!?

త్వరలోనే సమంత రెండో పెళ్లి..సద్గురు బాబా సంచలన ప్రకటన..!?

“వాట్.. సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందా..? ఏంటి నిజంగానే సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందా..? దీని మొహానికి రెండో పెళ్లి కూడానా..? ఎవరో పాపం ఆ దృష్టవంతుడు..?” ఎస్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ తో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ,స్టార్ హీరో నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ” ఏం మాయ చేసావే” సినిమా టైంలోనే వీరిద్దరూ చూపులు కలిసాయి ..ఆ తర్వాత మాటలు కలిసి ..మనసులు కలిసి.. ఇంట్లో వారిని కలిసి ఒప్పించి ఇద్దరు కలిసారు. గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ డెస్టినేషన్ ప్లాన్ చేసుకొని.. అంగరంగ వైభవంగా పెళ్లిని జరుపుకున్నారు.

వీళ్ళ పెళ్లి టైంలో చేసిన హడావిడి అంతా ఇంత కాదు. ఆటలు, పాటలు, కేకలు, కేరింతలు.. అబ్బో అది నానాహంగామ అనే చెప్పాలి. సీన్ కట్ చేస్తే పెళ్లై పట్టుమని ఐదేళ్లు కూడా కాకముందే విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతుకుతున్నారు సమంత -నాగచైతన్య. వీళ్లు విడిపోవాలని నిర్ణయించుకొని సపరేట్ గా జీవిస్తున్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ గుండె బద్దలు కొట్టారు. ఇప్పటికీ వీళ్లు విడిపోవడానికి సరైన రీజిన్ ఏంటో అభిమానులకి చెప్పలేదు. దీంతో జనాలు వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఊహించుకుంటున్నారు.. కొందరు సమంతకి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటుంటే ..మరికొందరు నాగచైతన్య లో మ్యాటర్ లేదు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సమంత రెండో పెళ్లి గురించి సంబంధించిన వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే సమంత రెండో పెళ్లి చేసుకోదు అని.. ఆమె తన దృష్టి మొత్తం సినిమాలపైనే పెట్టిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. కాగా సమంత పెళ్లి గురించి రీసెంట్గా సద్గురు బాబా కొన్ని కామెంట్స్ చేసిన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత పెళ్లి గురించి సద్గురు బాబా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడని ఇప్పటికే ఆమె కోసం వరుడిని ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో న్యూస్ తెగ చక్కెరలు కొడుతుంది.

మనకు తెలిసిందే ఫేమస్ స్పిరిచువల్ గురు సద్గురు బాబా అంటే సమంతకు అపారమైన గౌరవం, నమ్మకం. ఆమె ఆయన ప్రవచనాలను మిస్ కాకుండా వింటుంది. అంతేకాదు సద్గురు బాబా అంటే ఓ తండ్రి లాంటి వాడు అని ఆమె పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా అలాంటి సద్గురు బాగా చెప్తే సమంత కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటుందని .. అభిమానులు భావిస్తున్నారు . అంతేకాదు సద్గురు బాబా కూడా ఆమె కోసం మంచి వరుడిని వెతికి పెట్టాడని టైం చూసి ఆ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తారని .. న్యూస్ వైరల్ గా మారింది. అయితే దీనిపై అటు సమంతా కానీ ఇటు సద్గురు బాబా కానీ రియాక్ట్ కాకపోవడం గమనార్హం. మరి చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో సమంత రెండో పెళ్లిపై క్లారిటీ ఎప్పుడు ఇస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news