మనిషి అన్నాక కచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది ,కొందరికి మోజు కూడా ఉంటుంది. అది ఆడవారైనా మగవారైనా సరే ఖచ్చితంగా మనిషి పుట్టుక పుట్టాక ఎవరికైనా సరే కొన్ని కొన్ని ఇష్టాలు.. కొన్ని కొన్ని మోజులు.. కొన్ని కొన్ని సరదాలు ఉంటాయి . కానీ అవి అందరూ బయటకు చెప్పుకోలేరు. కొందరు మాత్రమే ధైర్యంగా చెప్పుకోగలరు. అయితే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి పాయల్ రాజ్ పుత్ తనకు ఇష్టమైన విషయాన్ని బయటపెట్టి సోషల్ మీడియాలో టాప్ Trending లోకి వచ్చింది .
మనకు తెలిసిందే పాయల్ రాజ్ పుత్ ప్రజెంట్ కెరియర్ ఎలా ఉందో. న్యూఢిల్లీలో జన్మించిన ఈ అందాల భామ పాయల్ నటనపై ఉండే ఇంట్రెస్ట్ తో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తెలుగులో 2018లో ఆర్ఎక్స్ 100 అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది ఈ బ్యూటి. ఆర్ఎక్స్ 100 చిత్రంలో పాయల్ నటించిన తీరు జనాలను మెప్పించింది. ఆఫ్ కోర్స్ ఆమె పాత్రకు తగ్గ న్యాయం చేసింది. బాయ్ ఫ్రెండ్ మోసం చేసే గర్ల్ ఫ్రెండ్ పాత్రలో పాయల్ లీనమైపోయింది. అంతేకాదు తన కోరిక తీర్చుకోవడానికి పరాయి మగాడిని ఎలా ఉపయోగించుకుందో కళ్ళకు కట్టిన్నట్టు చూపించాడు డైరెక్టర్. ఇక్కడ డైరెక్టర్ డైరెక్షన్ ఒక ప్లస్ పాయింట్ అయితే .. అంతలా తన హావ భావాలతో ఆ సీన్స్ పండించిన ఘనత పాయల్ ది అనే చెప్పాలి. మరే హీరోయిన్ కూడా అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు. సెక్సీ లుక్స్ తో కార్తికేయను నలిపేసింది. అంతలా తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేసింది పాయల్.
కాగా ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత పాయల్ బోలెడు సినిమాలో నటించింది . కానీ ఒక్కటి అంటే ఒక్క సినిమా కూడా ఆమెకు సరైన గుర్తింపు ఇవ్వలేకపోయాయి. కాగా రీసెంట్గా మంచు విష్ణు తో కలిసి జిన్నా అనే సినిమాలో నటించింది . ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది . అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాయల్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకున్న పిచ్చి గురించి బయటపెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. జనరల్ గా మల్లెపూలు అంటే అబ్బాయిలకు ఇష్టముంటుంది . ఎందుకంటే ఆ సువాసన టెంప్టింగ్ గా ఉంటుంది అంటూ చెప్పుకొస్తారు. అయితే చిన్నప్పటినుంచి ఎందుకో తెలియదు కానీ పాయల్ కు మల్లెపూలు అంటే చాలా ఇష్టమట . కచ్చితంగా ఇంట్లో ఉంటే పాయల్ మల్లెపూలు పెట్టుకొని ఆ స్మెల్ ని ఆస్వాదిస్తుందట . దీంతో ఈ విషయం తెలుసుకున్న జనాలు పాయల్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . అందుకేనా ఆర్ఎక్స్ 100 లో అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు నువ్వు కేక బేబీ అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.