Moviesఎంతగానో ప్రేమించి పెళ్లాడిన బోనీక‌పూర్ శ్రీదేవిని అంత వేధించాడా... న‌మ్మ‌లేని నిజాలు....!

ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన బోనీక‌పూర్ శ్రీదేవిని అంత వేధించాడా… న‌మ్మ‌లేని నిజాలు….!

అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీదేవి ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోని స్టార్ హీరోలకు జోడిగా శ్రీదేవి నటించారు. ఆమె అందానికి బాలీవుడ్ సైతం ఫిదా అయ్యింది. ఎప్పుడు అయితే శ్రీదేవి తెలుగు నుంచి హిందీలోకి వెళ్లిందో అప్ప‌టి నుంచి ఆమె వెన‌క్కు తిరిగి చూసుకోకుండా దేశం మొత్తం మొచ్చిన స్టార్ హీరోయిన్ అయిపోయింది.

కాగా శ్రీదేవి మొట్ట‌మొద‌ట‌ దాసరి నారాయణరావు దర్శకత్వంలో బంగారక్క సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఆ తర్వాత వరుస‌ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపారు. ఎన్టీఆర్ నుండి చిరంజీవి వ‌ర‌కూ రెండు త‌రాల హీరోల‌తో జ‌త క‌ట్టారు. ఏఎన్నార్‌తో పాటు ఆయ‌న త‌న‌యుడు నాగార్జున‌తోనూ జ‌త‌క‌ట్టిన ఘ‌న‌త శ్రీదేవిదే. టాలీవుడ్ లో సక్సెస్ చూసిన తర్వాత బాలీవుడ్ లోకి సైతం శ్రీదేవి అడుగు పెట్టారు. అక్కడ నిర్మాత బోనికపూర్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆ తర్వాత శ్రీదేవి బడా నిర్మాతను పెళ్లి చేసుకుంది…. లైఫ్ లో చాలా బాగా సెటిల్ అయ్యింది అని అంతా అనుకున్నారు. అయితే అవన్నీ పైపై మెరుపులు మాత్ర‌మే అని తాజాగా తేలింది. శ్రీదేవికి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలను సీనియ‌ర్ సినీ విశ్లేష‌కులు ఈమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి – జయప్రద మధ్య కోల్డ్ వార్ ఉండేదని ఆయ‌న చెప్పారు. వారిద్దరూ కనీసం మాట్లాడుకునేవారు కాదని వెల్లడించాడు.

అంతేకాకుండా శ్రీదేవి వ్యక్తిగత జీవితంలో సక్సెస్ అవ్వలేకపోయిందని తెలిపాడు. శ్రీదేవి వ్యక్తిగత జీవితంలో…. ఆర్థిక విషయాలలో చాలా ఇబ్బందులు పడిందని తెలిపారు. శ్రీదేవి వద్ద తాను కొంతకాలం పనిచేయడం వల్ల ఆమె గురించి తనకు తెలుసని చెప్పారు. జయప్రద కంటే శ్రీదేవి చాలా తెలివైందని అందుకే బాలీవుడ్ కి వెళ్లి మంచి ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవాలని అనుకుందని అన్నారు. కెరీర్ పరంగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ వ్యక్తిగతంగా మోసపోయింది అంటూ సంచలనాలు బయటపెట్టారు.

ఓసారి తను శ్రీదేవిని కలిసినప్పుడు యోగ‌క్షేమాలు మాట్లాడుకున్నామని చెప్పారు. ఆ సమయంలో నెలకు 25 లక్షల వడ్డీ కడుతున్నట్టు శ్రీదేవి తనతో చెప్పిందని అన్నారు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని… నమ్మి బోనీక‌పూర్ ను వివాహం చేసుకుంటే నిండా మునిగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింద‌ని చెప్పారు. అంతే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ఉండి ఉంటే బాగుండేదని….కానీ ఇప్పుడు తిరిగి రాలేన‌ని శ్రీదేవి అభిప్రాయపడిందని అన్నారు.

అంతేకాకుండా బోనీ కపూర్ మొదటి భార్య, కడుపుతో ఉన్నతన‌ను కొట్టిందని…. ఆమె కొడుకు అర్జున్ కపూర్ కూడా తనను కొట్టేవాడని శ్రీదేవి బాధపడినట్లు తెలిపారు. తన ఆస్తి మొత్తం కరిగించేశారు అంటూ శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశార‌ని ఈమంది రామారావు వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news