క్రికెటర్లు – హీరోయిన్ల మధ్య ఎఫైర్లు మనం ఎప్పటినుంచో చూస్తూ ఉంటున్నాం. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు.. భారత స్టార్ క్రికెటర్ల మధ్య ఎఫైర్లు, సహజీవనాలు ప్రేమలు.. పెళ్లిళ్లు నడుస్తూనే ఉన్నాయి. అప్పట్లో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ – కమలహాసన్ మాజీ భార్య సారిక మధ్య ప్రేమాయణం బాలీవుడ్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత కూడా మరో స్టార్ క్రికెటర్ రవిశాస్త్రి సైఫ్ ఆలీఖాన్ మాజీ భార్య అమృతాసింగ్ కూడా హాట్ హాట్ గా వార్తల్లో ఉండేది. అలాగే అజయ్ జడేజా – మాధురి దీక్షిత్ ప్రేమాయణం కూడా హైలెట్ అయ్యేది.
అప్పట్లోనే నీనా గుప్తా, విండీస్ మాజీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ కొద్ది రోజుల డేటింగ్‌లోనే నీనా గర్భవతి అయ్యి ఏకంగా ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇక ఇటీవల కాలంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ ఏకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు బాలీవుడ్ హీరోయిన్లు.. క్రికెటర్ల మధ్య ఇంకా చాలా ప్రేమాయణాలు… సహజీవనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ అందాల హీరోయిన్ .. ఓ యంగ్ స్టార్ క్రికెటర్ నిండా ప్రేమలో మునిగి తేలుతున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఇంతకీ ఈ జోడి ఎవరో కాదు బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ ముద్దుల కుమార్తె సారా అలీ ఖాన్ .. యంగ్ క్రికెటర్ శుభ్‌మన్‌గిల్. తాజాగా సారా, శుభయన్ గిల్‌తో కలిసి ముంబైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు డిన్నర్‌కు వెళ్లిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఇవి ఇప్పుడు మామూలుగా వైరల్ కావడం లేదు. ఈ ఫొటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. అయితే కొద్ది రోజుల ముందు వరకు కూడా శుభమన్ గిల్, భారత మాజీ స్టార్ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్‌తో డేటింగ్ చేస్తున్నాడన్న పుకార్లు వచ్చాయి.
ఇటు సారా ఆలీఖాన్… లవ్ ఆజ్‌కల్ 2 సినిమాలో కనిపించిన ఆర్యన్‌తే డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు వచ్చాయి. అంతకు ముందు సారా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కూడా డేటింగ్ చేసింది. అయితే ఇప్పుడు ఇటు సారా, అటు గిల్ పాత ప్రేమలు బ్రేకప్ కావడంతో ఇద్దరూ కలిసి కొత్తగా డేటింగ్ మొదలు పెట్టారన్న గుసగుసలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఇక గిల్ భారత క్రికెట్ జట్టులోకి 2017 ఫిబ్రవరిలో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవలే సారా ఆలీఖాన్ తన ఎఫైర్ కహానీ గురించి కాఫీ విత్ కరణ్ 7 షోలో ఓపెన్‌గా వెల్లడించి రచ్చ లేపింది. మరి ఈ కొత్త జంట డేటింగ్ ఎన్ని రోజులు ఉంటుందో ? చూడాలి.