Moviesటాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్లు త్రివిక్రమ్ Vs రాజమౌళి మ‌ధ్య ఇంత...

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్లు త్రివిక్రమ్ Vs రాజమౌళి మ‌ధ్య ఇంత కోల్డ్ వార్ న‌డుస్తోందా…!

టాలీవుడ్ లో దర్శక ధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు కూడా టాప్ దర్శకులే. వీరిద్దరికీ హీరోలతో సంబంధం లేకుండా ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పన‌క్కర్లేదు. ఈ ఇద్దరు దర్శకులు తమ చివరి సినిమాలు సూపర్ హిట్ అవడంతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. త్రివిక్రమ్ చివరిగా అల్లు అర్జున్ తో తీసిన `అలవైకుంఠపురంలో` సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ తో తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా `త్రిబుల్ ఆర్ `కూడా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు టాప్ దర్శకులు ఇప్పుడు మహేష్ బాబుతో తమ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

అయితే కెరీర్ లో త్రివిక్రమ్‌కు కొన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చినా.. రాజమౌళికి మాత్రం ఇప్పటివరకు అపజయం అన్నదే తెలియదు. అయితే ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్ల కేరీర్లు పరిశీలిస్తే రాజమౌళి ఎక్కువగా ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ కు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. త్రివిక్రమ్ ఎక్కువగా పవన్, బన్నీ, మహేష్ తో సినిమాలు చేశారు. అయితే మధ్యలో `త్రిబుల్ ఆర్` సినిమాకి ముందు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ దర్శకత్వంలో `అరవింద సమేత` సినిమాలో నటించారు. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఇద్దరు స్టార్ డైరెక్టర్లు ముందు నుంచి ఒక డైరెక్టర్ ప్రయారిటీ ఇచ్చిన హీరోకు మరో డైరెక్టర్ ప్రయారిటీ ఇవ్వలేదు. దీంతో అప్పటినుంచి ఇద్దరు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న ప్రచారం గట్టిగా జరిగింది. దీనికి తోడు తెలుగు సినిమా ఖ్యాతి పెంచిన `బాహుబలి` సినిమాపై ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించినా త్రివిక్రమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అప్పుడు కూడా ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న ప్రచారం అయితే గట్టిగానే నడిచింది.

రీసెంట్ గా మ‌హేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి అందరూ చర్చించుకుంటున్న సమయంలో తాను మహేష్ తో చేయబోయే సినిమా ఎలా ?ఉంటుందో రాజమౌళి కామెంట్ చేశారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి – మహేష్ బాబు సినిమాపై పడింది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న కోల్డ్ వార్ మరోసారి బయటపడిందని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి.

ఇక రాజమౌళి చిన్న హీరోలు, చిన్న దర్శకుల సినిమాలను కూడా బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఆయన త్రివిక్రమ్ సినిమాల విషయంలో ఎప్పుడు కామెంట్ చేయలేదు. వీరిద్దరి మధ్య ఉన్న కోల్డ్ వారు వల్లే వీరు ఇలా చేస్తున్నారన్న గుసగుసలు అయితే ఎప్పటినుంచో ఉన్నాయి. మరి అసలు నిజం ఏంటన్నది ఈ ఇద్దరికే తెలియాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news