మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ సినిమాల విషయంలో ఎందుకో గాని ముందు నుంచి పెద్ద గందరగోళమే నడుస్తోంది. `ఆచార్య` సినిమా విషయంలో చాలా గందరగోళం నడిచింది. చివరి వరకు అసలు హీరోయిన్ ఎవరో తెలియదు.. కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నా ఆమె మధ్యలో తప్పుకోవడంతో చివరకు కథనే మార్చేశారు. తీరా సినిమా రిలీజ్ కి ముందు కూడా పెద్ద బజ్‌లేదు. చివరకు రామ్ చరణ్ లాంటి హీరో ఉండి మల్టీ స్టార్ సినిమాగా వచ్చి కూడా `ఆచార్య` డిజాస్టర్ అయింది.
`ఆచార్య` డిజాస్టర్ అవటం ఒక ఎత్తు అయితే.. చిరంజీవి పరువు కూడా తీసేసింది. ఇక చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న రీమేక్ సినిమాల విషయంలోనూ సినిమా అభిమానుల్లోనే కాదు ఆయన వీరాభిమానుల్లోనూ పెద్దగా ఆశలు అంచనాలు అయితే లేవు. `లూసిఫర్` కు రీమేక్‌గా వస్తున్న `గాడ్ ఫాదర్` మరో పది రోజుల్లో థియేటర్లలోకి దిగనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్, టీజర్లు సాంగ్స్ ఏ మాత్రం ఆసక్తిగా లేవు. పేరుకు నయనతార హీరోయిన్ అని చెబుతున్న ఆమె స్టిల్స్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు.
మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న చిరంజీవి ఇంకా ప్రమోషన్లు స్టార్ట్ చేయలేదు. ఆకాశంలో స్పెషల్ జెట్లో శ్రీముఖితో ఇంటర్వ్యూ అని టీజర్ వదిలారు. అయినా సినిమాకు ఏమాత్రం హైప్ రావడం లేదు. అటు బిజినెస్ వర్గాల్లోనూ ఈ సినిమా పట్ల పెద్దగా అంచనాలు లేవనే చెబుతున్నారు. చిరంజీవికి `గాడ్ ఫాదర్` విషయంలో ఎక్కడో సందేహం ఉందని, అందుకే ఆయన సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదని.. ప్రమోషన్ల పట్ల కూడా ఆసక్తి చూపటం లేదన్న గుసగుసలు అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు కీలకమైన నైజాంలో `గాడ్ ఫాదర్` కు థియేటర్లు ఇవ్వకుండా కొందరు అడ్డం పడుతున్నారన్న కథనాలు వస్తున్నాయి. `గాడ్ ఫాదర్` నైజాం పంపిణీ హక్కులను ముందుగా దిల్ రాజుకు ఇవ్వాలని అనుకున్నారు. అయితే కొత్త పార్టీ రంగంలోకి దిగి నాన్ రెఫండబుల్ అడ్వాన్స్‌తో మంచి రేటు ఆఫర్ చేయడంతో నిర్మాతలు వాళ్ళ వైపే మొగ్గు చూపారు. అయితే ఆ కొత్త పార్టీకి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేదు. వాళ్ళు ఆసియన్ సునీల్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో సునీల్ చేతుల్లో డిస్ట్రిబ్యూషన్ పెట్టినట్టు తెలుస్తోంది.
సహజంగానే ఇది నైజాంలో మరో టాప్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు – శిరీష్ కు కోపం తెప్పించినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు `గాడ్ ఫాదర్` లకు అక్కడ థియేటర్ల సమస్య మొదలైనట్టు తెలుస్తోంది. కీలకమైన థియేటర్లు అన్ని `గాడ్ ఫాదర్` కు ఇవ్వడం లేదట. విచిత్రం ఏంటంటే డబ్బింగ్ సినిమా అయిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాకు కీలకమైన థియేటర్లు కేటాయిస్తున్నారట. కీలకమైన హైదరాబాదులోనూ మంచి థియేటర్లు అన్ని ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాకే వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలపై రామ్ చరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రంగంలోకి దిగినట్టు తెలిసింది. రామ్ చరణ్ తో ప్రస్తుతం దిల్ రాజు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఎంట్రీ తో దిల్ రాజు, శిరీష కాస్త దిగివచ్చి `గాడ్ ఫాదర్` కు కోఆపరేట్ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం అయితే దిల్ రాజు – శిరీష్‌తో ఆసియన్ సునీల్ డిస్కర్షన్లు ప్రారంభించిన ట్లు సమాచారం. ఏదేమైనా `గాడ్ ఫాదర్` సినిమాకు కీలక థియేటర్లు దక్కకుండా చేయటం రామ్ చరణ్‌ణు బాగా హార్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సినిమాపై అంత కాన్ఫిడెంట్‌గా లేకపోవడంతో చిరు కూడా సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు.