సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి.. పరువు ప్రతిష్టల గురించి వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఓ చెరగని స్థాయిని సంపాదించి పెట్టుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి . ఇండస్ట్రీలోకి ఏ సపోర్ట్ లేకుండా వచ్చి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సినీ రంగంలో అడుగుపెట్టి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసాడు . ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తూ శభాష్ అని జనాల చేత అనిపించుకున్నాడు . అలాంటి ఓ గొప్ప స్థానాన్ని పేరుని ఏర్పరచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.
కాగా ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోస్ పరిస్థితి ఎలా ఉన్నాగాని ఆయన వారసత్వంగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన కొడుకు రామ్ చరణ్ కెరియర్ మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. చిరుత సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ ..ఆ తర్వాత మగధీర ఆ తర్వాత బోలెడన్ని సినిమాల్లో నటించి హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తనదైన స్టైల్ లో కథలను చూస్ చేసుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.
అయితే, అయితే నిజానికి మెగాస్టార్ చిరంజీవికి తన కొడుకు రామ్ చరణ్ ని హీరోగా చూడడం ఇష్టం లేదట. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవనే విషయం చిరంజీవికి బాగా తెలుసు. పైగా మనం పైకి ఎదుగుతుంటే వెనక తొక్కేసే జనాలు బోలెడు మంది ఉంటారు . దీంతో ఈ టెన్షన్స్ అంతా వద్దు అని చరణ్ డాక్టర్ అవ్వాలని నలుగురికి ఉపయోగపడాలని కోరుకున్నారట. కానీ చరణ్ కి మొదటి నుంచి సైన్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదట . చదువులో కూడా చరణ్ సూపర్ స్టూడెంట్ అని చెప్పలేం. అందుకే చిరు క్రమీన ఆయన ఆ ఆలోచన నుండి బయటకు వచ్చాడు. అంతే కాదు అదే టైం లో చరణ్ నేను హీరో అవుతాను నాన్న అనగానే తన ఇంట్రెస్ ని కాదనలేక సినిమా ఇండస్ట్రీ లోకి తీసుకొచ్చాడు. దీంతో చిరు కోరిక తీరకుండా అలాగే మిగిలిపోయింది.