మెగాస్టార్ చిరంజీవి అంటేనే స్వయంకృషికి పెట్టింది పేరు. `పునాదిరాళ్ళు` సినిమాతో టాలివుడ్ లో బలమైన పునాది వేసుకున్న చిరు.. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ రోజు మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా పది మంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అంటే అందుకు చిరంజీవి వేసిన బలమైన పునాదే కారణం అని చెప్పాలి. చిరు ఏకంగా మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకచక్రాధిపత్యంతో ఏలేశారు.
చిరు ఈ రోజు ఇంత స్టార్ హీరోగా ఉండటానికి ఆయన ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తతో వేయటమే కారణం. దీనికి తోడు విపరీతంగా కష్టపడటం కూడా చిరుని ఈ రోజు ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టింది. కెరియర్ ప్రారంభంలో చిరంజీవి తన సినిమాలకి హైప్ రావడం కోసం బాగా కష్టపడేవారు. డాన్స్ లు, ఫైట్లు చేయడంతో పాటు స్టార్ హీరోయిన్లతోనే ఎక్కువ జత కట్టేవారు. 1980 వ దశకంలో స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న విజయశాంతి, భానుప్రియ, రాధిక, రాధ లాంటి హీరోయిన్ లతోనే ఎక్కువ సినిమాలు చేశారు.
అప్పట్లో రాధ చాలా హట్ హట్ గా ఉండేది. చిరు, రాధ కాంబినేషన్ అంటే ఒక క్రేజ్ ఉండేది. రాధతో చిరు `దొంగ`, `నాగు`, `స్టేట్ రౌడీ`, `కొండవీటి దొంగ` లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు చేశారు. అప్పట్లో చిరు, రాధ తెర మీద డాన్స్ చేస్తుంటే ఈలలు, గోలలతో థియేటర్ మారుమేగిపోయేది. మాస్ జనాలలో రాధ, చిరంజీవి కాంబినేషన్ కు పిచ్చి క్రేజ్ ఉండేది. చిరుతో పోటీ పడి డ్యాన్స్ చేసే ఏకైక హీరోయిన్ ఎవరు ? అంటే రాధ మాత్రమే. రాధ డ్యాన్స్ అంటే చిరంజీవి ఎంతో ఇష్టపడటంతో పాటు, ఓ విధంగా చెప్పాలంటే ఇబ్బంది కూడా పడేవారట.
డ్యాన్స్ మాస్టర్ ఒక మూమెంట్ చెప్పిన ఐదు నిమిషాలకే రాధ రెడీ అయిపోయి సెట్స్ లోకి వచ్చేసేదట. అయితే చిరు కనీసం పది నిమిషాలకు పైగా టైమ్ తీసుకునేవారట. రాధ క్రేజ్, ఎనర్జీ చూసి తాను సైతం చాలా సందర్భాల్లో షాక్ అయ్యానని ఆయనే స్వయంగా చెప్పారు. అప్పట్లో వీరిద్దరూ చాలా ఫ్రెండ్లీగా బయటే కలిసి తిరిగేవారట. పైగా ఎక్కువ సినిమాల్లో కలిసి నటించారు.
దీంతో వీరిద్దర మధ్య ఎఫైర్ ఉందంటూ అప్పట్లో తమిళ పత్రికలు కోడై కూశాయి. ఈ ప్రచారం గట్టిగా జరిగింది. ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇదే వార్త హాట్ టాపిక్‌గా నిలిచింది. అయితే చిరంజీవి మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకున్నారట. అటు రాధ కూడా ఈ వార్తలను చదివి నవ్వుకునేదట. అలా చిరు, రాధ మధ్య ఎఫైర్ వార్తలు అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి