Moviesఆ చైల్డ్ ఆర్టిస్ట్ డేట్లు కోసం వెయిట్ చేస్తున్న బన్ని.. ముసలోడు...

ఆ చైల్డ్ ఆర్టిస్ట్ డేట్లు కోసం వెయిట్ చేస్తున్న బన్ని.. ముసలోడు అంటూ షాకింగ్ కామెంట్స్..!?

వల్లంగి పిట్ట ..వల్లంగి పిట్ట అనే ఈ పాటలో ఓ చిన్నారి పాప క్యూట్ క్యూట్ స్మైల్ తో అలరించింది గుర్తుందా.. అబ్బో మర్చిపోయే నటన ఆ పాపది. చిన్న ఏజ్ లోనే స్టార్స్ సైతం తన యాక్టింగ్ తో మెప్పించిన క్యూట్ లిటిల్ గర్ల్ . ఇప్పుడు పెద్దది అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ కోసం హీరోయిన్ గా ట్రై చేస్తుంది. రీసెంట్ గా ఈ పాప ఆలీతో సరదాగా గేమ్ షో కి హాజరైంది. ఈ క్రమంలోనే అమ్మడు గురించి బోలెడన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు ఆలీ.. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!

గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ పాప పేరు కావ్య కళ్యాణ్ రామ్. పాల బుగ్గలతో క్యూట్ గా ఉండే కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 12 చిత్రాలు చిత్రాలలో నటించింది. అన్ని సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ పాప మసూదా చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదా షోకి వచ్చిన కావ్య తన సినిమా గంగోత్రి టైంలో అల్లు అర్జున్ తో జరిగిన చిన్న ఫన్నీ సంభాషణను బయటపెట్టింది. ప్రజెంట్ ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


కావ్య మాట్లాడుతూ..” గంగోత్రి సినిమా టైంలో అల్లు అర్జున్ గారు నువ్వు పెద్ద అయ్యాక కచ్చితంగా హీరోయిన్ అవుతావు అన్నారు. ఆ టైంలో నాకు డేట్స్ ఇస్తావా అని కూడా అడిగారు. అల్లు అర్జున్ కాదు చాలామంది హీరోలు అలా అడిగారు . గంగోత్రి లో హీరోయిన్ గా చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తున్న టైంలో అల్లు అర్జున్ పెద్దయ్యాక నువ్వు హీరోయిన్ అవుతావు కదా ..అప్పుడు నీ డేట్స్ కావాలి ఇస్తావా.. అని అడిగారు ..దీంతో అప్పటికి మీరు ముసలోళ్ళు అయిపోతారు కదా ..నాతో ఎక్కడ నటిస్తారు అని అడిగేశాను. ఆ వయసులోనే నా సెన్సాఫ్ హ్యూమర్ పుష్కలంగా ఉంది అంటూ నవ్వేసుకున్నారు ..”అంటూ ఆలీతో సరదాగా షోలో బయటపెట్టింది. అంతేకాదు నిజంగా అల్లు అర్జున్ అప్పుడు అడిగిన మాట ఇప్పుడు అడిగితే అది ఎంత పెద్ద ఆఫర్ అనేది ఆమెకే తెలుసు అంటున్నారు బన్నీ అభిమానులు. మరి చూడాలి చిన్నప్పటి హీరోయిన్ కి బన్నీ అవకాశం ఇస్తారా లేదా అనేది..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news