టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సీనియర్ నటీమణి సురేఖవాణి మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో బాగా డిమాండ్ ఉన్న నటీమణుల్లో సురేఖ వాణి ఒకరు. ఆమె ఎక్కువ సినిమాలలో నటించకపోయినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. విజయవాడకు చెందిన సురేఖ వాణి దాదాపుగా రెండున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఆమె ఎక్కువగా అక్క, వదిన పాత్రలతో బాగా హైలైట్ అయింది. వాస్తవంగా ఆమె మరీ చెప్పుకోదగ్గ సినిమాలు అయితే చేయలేదు. అయితే సోషల్ మీడియాలో తన కుమార్తె సుప్రీతతో కలిసి ఎప్పుడు చాలా హాట్ హాట్ గా దర్శనమిస్తూ ఉంటుంది.
ముఖ్యంగా ఆమె భర్త మృతి చెందాక కుమార్తె సుప్రీతితో కలిసి మరీ రెచ్చిపోతుందని చర్చలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ వయసులో కూడా చిట్టిపొట్టి దుస్తులు వేసుకొని తన కూతురితో కలిసి రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. మందు తాగే ఫోటోలు కూడా షేర్ చేస్తూ తాను ఎక్కడా తగ్గనని చెబుతూ ఉంటుంది. పైగా డబ్బున్న వాడు ఎవరైనా తగిలితే తాను రెండో పెళ్లి చేసుకుంటాను అని కూడా సంకేతాలు ఇస్తుంది. సుప్రీతతో కలిసి డ్యాన్స్ చేయడంతో పాటు పార్టీ చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయటం ఆలస్యం అవి కావలసినంత క్రేజ్ తెచ్చుకుంటాయి.
చాలాసార్లు ఈ వీడియోలు కాంట్రవర్సీ కూడా అయ్యాయి. అయితే నెగిటివ్ కామెంట్లను ఏమాత్రం పట్టించుకొని ఈ తల్లి కూతుర్లు చాలా ఘాటుగా రిప్లై ఇస్తూ ఉంటారు. మరీ సినిమాలు చేయకపోయినా కూడా సురేఖవాణి చాలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.. ఆమెకు ఇంత డబ్బు ఎలా ? వచ్చిందా ? అని కొందరు సందేహాలు కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక సురేఖ వాణి సినిమాల ద్వారా ఇప్పటివరకు 10 కోట్లకు పైగా స్థిర, చరాస్తులను సంపాదించుకుందట.
ఇక సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఈ తల్లి కూతుర్లు బాగానే సంపాదిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు సురేఖవాణికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయని చెప్పాలి. సురేఖవాణికి ప్రత్యేకంగా ఉన్న అభిమానులు మళ్లీ ఆమె తిరిగి సినిమాల్లో బిజీ కావాలని కోరుకుంటున్నారు. సురేఖవాణి స్థాయి మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులతో పోల్చుకుంటే ఆమె చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందన్న అన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి.