Movies'బ్రహ్మాస్త్రం' ఫస్ట్ రివ్యూ: హిట్టా..ఫట్టా..?

‘బ్రహ్మాస్త్రం’ ఫస్ట్ రివ్యూ: హిట్టా..ఫట్టా..?

హమ్మయ్య ఎట్టకేలకు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కలిసి జంటగా నటించిన చిత్రం “బ్రహ్మాస్త్రం” థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మొదటినుంచి ఈ సినిమాపై నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలియా మాట్లాడిన హై టెంపర్ మాటలు.. రీసెంట్ గా రణబీర్ పై బజరంగ్ దళ్ వాళ్లు చేసిన కామెంట్స్,, సినిమాను మరింత కష్టాల్లోకి నెట్టేసాయి. కాగా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన బ్రహ్మాస్త్రం సినిమా మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా పౌరాణిక అంశాలతో చిత్రీకరించిన విషయం తెలిసిందే . ఈ సినిమా దక్షిణాది భాషల్లో రిలీజ్ చేశారు . కాగా ఈ సినిమాకి తెలుగులో సమర్పికుడిగా వ్యవహరిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి . అందుకే ఆయన అలుపెరగని ప్రమోషన్స్ చేసి సినిమాకు వీలైనంత హైప్స్ తీసుకొచ్చారు. మరి అన్ని ప్రమోషన్స్ చేసిన బ్రహ్మాస్త్ర సినిమా థియేటర్స్ లో జనాలను మెప్పించిందా..? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..!!


బ్రహ్మాస్త్ర..మొత్తం ఓ పౌరాణిక సినిమా. నేటీ కాలంలో అవ్స్తున్న సినిమాలకు పూర్తి వ్యతిరేకంగా వచ్చిన కాన్సెప్ట్ ఇది. అలాంటి ఓ సరికొత్త కధని తీసుకువచ్చారు అయాన్ ముఖర్జీ. ఈ సినిమాను ను ఖచ్చితంగా అమితాబచ్చన్, అలియా, రణబీర్, నాగార్జున నటన కోసం ఒక్కసారైనా చూడొచ్చు. మొదటి నుంచి ఈ సినిమాపై విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని చెప్పుకొచ్చిన మేకర్స్ ..ఈ సినిమాలో టూ మచ్ విజువల్ ఎఫెక్ట్స్ తో అసలకే మోసం చేశారు అంటున్నారు సినిమా చూసిన జనాలు . పెట్టాల్సిన వాటికన్న ఎక్కువ ఎఫెక్ట్స్ పెట్టి సినిమా చూసే జనాలకి బోర్ కొట్టిచ్చారట. ఇదే విషయాన్ని సినిమా చూసి బయటికి వచ్చిన జనాలు చెప్పుకొస్తున్నారు .

అమితాబచ్చన్, నాగార్జున వాళ్ళ పాత్రకు న్యాయం చేశారని అంటున్నారు. అయాన్ ముఖర్జీ సింపుల్ స్టోరీ లైన్ ని తీసుకున్నారు కాని దాని వివరించడంలో మాత్రం ఏ మాత్రం ఫ్లాప్ అవ్వలేదు తాను అనుకున్న పాయింట్ ని.. సరిగ్గా జనాలకు అర్థమయ్యేలా తీశారని నెటిజన్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు కచ్చితంగా అయాన్ ముఖర్జీ లో మంచి టాలెంట్ ఉందని కొంచెం కష్టపడితే మంచి డైరెక్టర్ అవ్వగలరని అంటున్నారు అంతేకాదు మొదటి నుంచి బ్రహ్మాస్త్ర బాయ్ కాట్ ట్రెండ్ ని అధిగమించాలని ఈ మూవీ చూస్తూనే ఉంది. బాలీవుడ్ లో వరుస పరాజయాలకు బ్రేక్ వేయగలుగుతుందా..? అని చాలామంది డౌట్ పడ్డారు. కాగా ఈ సినిమా కి అంత సీన్ లేదని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. టాక్ పరంగా కచ్చితంగా సినిమా బాగుంది..కానీ రికార్డ్లు కొల్లగొట్టే విధంగా లేదు అనేది వాళ్ల అభిప్రాయం. ఎలాంటి వాళ్లకైనా సరే థియేటర్స్ లో సినిమా చూస్తే బయటికి వచ్చాక కళ్ళు పోతాయి అన్నంత భయంకరంగా విజువల్ ఎఫెక్ట్స్ పెట్టారని కామెంట్ చేశారు నెటిజన్. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ కి హ్యాట్సాఫ్ అని చెప్తున్నారు. నటుల నటన కోసం అయితే ఒక్కసారి చూడొచ్చని దయచేసి విజువల్ ఎఫెక్ట్స్ నమ్ముకొని సినిమాకు వెళ్లొద్దని చెప్పుకొచ్చాడు ఓ నెటిజన్.


మొత్తానికి రెండు గంటల 40 నిమిషాలు నడివి ఉన్న ఈ సినిమా జనాలు దగ్గర మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. కొందరు జనాలు మాకు నచ్చింది అంటుంటే కొందరు జనాలు డైరెక్షన్ బాగుంది నటన బాగుంది కానీ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకి దెబ్బెసాయి అంటున్నారు మరి చూడాలి ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news