సినిమా రంగంలో కూడా.. అనుకున్న విధంగా ఏదీ జరిగిపోదు. ముందు అనుకున్నట్టు చివరి షెడ్యూల్ వరకు.. ఒకేపరంపరగా కూడా సాగదు. అవసరం.. అవకాశం అనే రెండు అంశాలపైనే సినిమా కూడా ముందుకు సాగుతుంది. అప్పటికీ.. ఇప్పటికీ.. అది బ్లాక్ అండ్ వైట్ అయినా.. కలర్ అయినా.. ఈ విష యంలో ఇప్పటికీ.. అనుసరిస్తున్న విధానం ఇదే. అప్పటి వరకు అనుకున్నట్టు.. చివరి నిముషం వరకు సాగదు. సో.. మార్పు అనేది ఎప్పుడు ఏరూపంలో వస్తుందో చెప్పలేం.
ముందుగానే అనుకున్న హీరోను.. హీరోయిన్‌ను మార్చేసిన సందర్భాలు ఉంటాయి. ఉన్నాయి. అయితే.. గతంలో ఒక కథ అనగానే.. ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని రెడీ చేసుకునేవారు. దీంతో ఆ హీరోకు తగిన విధంగానే కథ కూడా అల్లేవారు. అయితే చివర్లో ఏవేవో కారణాలతో అనూహ్యంగా ముందుగా అనుకున్న హీరోకు బదులుగా మరో హీరో వచ్చి చేరతాడు. అలాగే హీరోయిన్లు కూడా ముందుగా అనుకున్న వారు మారిపోతూ ఉంటారు.
ఇలా అనుకున్నదే.. మూగమనసులు.. సినిమా. దీనిలో మొదట అన్న గారు ఎన్టీఆర్‌ను అనుకున్నారట. ఆయనకు తగిన విధంగానే డైలాగులు కూడా రాసుకున్నారు. అయితే.. చివరి నిముషంలో ఆయన ప్లేస్‌లో అక్కినేని నాగేశ్వరరావును ఎంచుకున్నారు. వాస్తవానికి అప్పటికి.. క్లాస్ హీరోగా.. అక్కినేని పేరు తెచ్చుకున్నారు. ఈ సమయంలో అక్కినేని అంత మాస్ లెవిల్లో నటించగలరా? అనే సందేహాలు కూడా వచ్చాయట.
అయినా.. కూడా అన్నగారితో కాల్ షీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో ఆయనను పక్కన పెట్టారని.. ఆయన ప్లేస్‌లో అక్కినేనిని తీసుకున్నారని.. గుమ్మడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అంతేకాదు.. మొదట్లో.. ఈ సినిమా కూడా ఇబ్బంది పెట్టినా.. తర్వాత.. తర్వాత.. పాటలు హిట్ కావడంతో సినిమా కూడా హిట్టయిందట..!