“వాట్.. ఏంటి బిగ్ బాస్ షో ఆపేస్తున్నారా ఏమైంది? ఎందుకు బిగ్ బాస్ షో ఆపేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. మనకు తెలిసిందే బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో గా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ సీజన్ 6 ప్రజెంట్ తెలుగులో రన్ అవుతుంది. అయితే స్టార్ మా ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న ఈ బిగ్ బాస్ షో కి మేనేజ్మెంట్ అనుకున్న టిఆర్పి రేటింగ్స్ రావట్లేదట .
అంతేకాదు రోజు రోజుకి టిఆర్పి స్థాయి మరింత దిగజారిపోతూ ఉండడంతో రంగంలోకి నాగార్జున దిగారు . ఇన్ డైరెక్ట్ గా రెచ్చ కొట్టే కామెంట్స్ చేస్తున్నా కానీ నాగార్జున మాటలను బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తిన్నామా పడుకున్నామా అన్న విధంగా ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు . దీంతో స్టార్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కు కోపం వచ్చి ఇకపై బిగ్ బాస్ షోను నిర్వహించకూడదని డిసైడ్ అయ్యారట.
అంతేకాదు బిగ్ బాస్ షో టిఆర్పి రేటింగ్స్ సీజన్ సీజన్ కి పడిపోతూ ఉండడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. మనకు తెలిసిందే ఎన్టీఆర్ హోస్టుగా 2017 లో ఈ బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది .అయితే మొదటి సీజన్ కి బ్లాస్టింగ్ టిఆర్పి రేటింగ్స్ ఉండడం తో బిగ్ బాస్ 2 ను ముందుకు తీసుకొచ్చారు మేనేజ్మెంట్ . అయితే బిగ్ బాస్ 2 కు హోస్టుగా నాని ఎంటర్ అయ్యారు. బిగ్ బాస్ 2 కూడా పర్లేదు అనిపించింది టిఆర్పి పరంగా మెప్పించింది. అయితే బిగ్ బాస్ 3 కి హోస్టుగా నాగార్జున ఎంటర్ అయ్యారు . అప్పటినుంచి అన్ని బిగ్ బాస్ సీజన్స్ కి నాగార్జున హోస్ట్ గా చేశారు. అయితే హైయెస్ట్ గా బిగ్ బాస్ తెలుగు 4 లాంచింగ్ ఎపిసోడ్ కి 18.8 టిఆర్పి రేటింగ్ రాబట్టింది . కానీ లేటెస్ట్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి దారుణంగా కేవలం రెండు అంటే రెండే టిఆర్పి రేటింగ్స్ రాబట్టింది. నిజానికి ప్రైమ్ టైంలో ఓ పాపులర్ షో కి ఈ రేటింగ్ అంటే చాలా దారుణం అని అంటున్నారు జనాలు. కాగా ఇదే కొనసాగితే బిగ్ బాస్ షోను ఇకపై ఆపేయడం కరెక్ట్ అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. స్టార్ మా కూడా ఇదే ఆలోచనలో ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తల్ అవుతున్నాయి.