Moviesహమ్మయ్య.. ఆ ప్రాబ్లమ్ తీరిపోయిన్నట్లేగా.. బిగ్ రిలీఫ్..!?

హమ్మయ్య.. ఆ ప్రాబ్లమ్ తీరిపోయిన్నట్లేగా.. బిగ్ రిలీఫ్..!?

యస్ ఇప్పుడు ఇదే అనుకుంటున్నారు. సమంత ఫ్యాన్స్ “హమ్మయ్య ..మా సమంత సేఫ్ …మాకు ఇక ప్రాబ్లం లేదు” అని ఊపిరి పీల్చుకుంటున్నారు. బిగ్ రిలీఫ్ అని కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ సమంత అంతా హమ్మయ్య అనిపించే న్యూస్ ఏం చెప్పిందనేగా మీ సందేహం.. ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఇది చదవండి మీకే అర్థమవుతుంది.


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రేంజ్ లో దూసుకుపోతున్న సమంత అనుకోని విధంగా భర్తకు విడాకులు ఇచ్చి తన కెరియర్ ని స్పాయిల్ చేసుకుంటుంది అంటూ అందరూ తిట్టుకోచ్చారు. బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకున్న సమంత అంటూ స్టార్స్ కూడా ఆమెను పరోక్షకంగా వార్న చేశారు. కానీ “అవి ఏమీ పట్టించుకోని సమంత నా రూటే సపరేట్… నాకు ఇష్టమైన పనే చేస్తా” అంటూ డివర్స్ ఇచ్చేసి క్రేజీ క్రేజీ ప్రాజెక్ట్స్ ను పట్టేసింది.

ప్రజెంట్ సమంత టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అన్ని భాషల్లోని సినిమాలు చేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తుంది. కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి . కొందరు ఆమెకి ఆరోగ్య సమస్య కారణంగా హాస్పిటల్ అడ్మిట్ అయిందని ..మరికొందరు చర్మ సమస్యలతో బాధపడుతుందని ..అందుకే బయటకు రావట్లేదని ..మరికొందరు స్టార్ హీరో ఆమెకు సలహా ఇచ్చారని అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉందని.. మరికొందరైతే ఏకంగా ఆమె గర్భసంచి తీయించేసుకునిందని కూడా వార్తలు పుట్టించారు .

వీటిల్లో దేనిపై అఫీషియల్ ప్రకటన అయితే సమంత చేయలేదు కానీ ఫస్ట్ టైం సమంత మేనేజర్ ఈ వార్తలపై ఫైర్ అయ్యారు. సమంత ఆరోగ్యంగా ఉందని ఆమెకు ఎలాంటి ప్రాబ్లం లేదని ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో సమంత హ్యాపీగా ఉందన్నమాటనే వాళ్ళకి నోట్లో చక్కెర పోసినంత ఆనందాన్నిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news